Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిస్నీ గ్లోబల్ థియేట్రికల్ రిలీజ్ ప్ర‌క‌టించిన బ్రహ్మాస్త్ర, అవ‌తార్‌2

Advertiesment
Brahmastra
, సోమవారం, 9 మే 2022 (11:05 IST)
Brahmastra
వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ తన గ్లోబల్ థియేట్రికల్ రిలీజ్ లిస్ట్‌లో ప‌లు సినిమాల‌ను ప్ర‌క‌టించింది. అయాన్ ముఖర్జీ మాగ్నమ్ ఓపస్ 'బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ. ఇందులో మొద‌టిది. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని నటించిన ఈ సినిమా సాంకేతిక ప‌నులు జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 09.09.2022న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయ‌నున్న‌ట్లు డిస్నీ సంస్థ తెలిపింది.
 
webdunia
Avatar2
అంతేకాకుండా ఈ క్ర‌మంలోనే  థోర్: లవ్ అండ్ థండర్, బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్, అవతార్:2 (ది వే ఆఫ్ వాట‌ర్ ఫ‌ర్ 2022) కూడా ఉన్నాయి. ఇటీవ‌లే అవ‌తార్ 2 థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మార్వెల్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ప్ర‌ద‌రించారు. అంతా నీటిలో జ‌రిగే విన్యాసాలు అబ్బుర‌ప‌రిచేలా వున్నాయి.
ఫాక్స్ స్టార్ స్టూడియోస్ (వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్) మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ నిర్మించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన పూరీ, స‌మంత‌!