Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓ వైపు యుద్ధం - మరోవైపు భార్యతో జలెన్‌స్కా ఫోటోషూట్

jelenskey
, గురువారం, 28 జులై 2022 (07:42 IST)
ఉక్రెయిన్ దేశంపై రష్యా ఏకపక్షంగా దండయాత్ర చేసింది. ఈ యేడాది ఫిబ్రవరి 24వ తేదీన ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంి ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగ మారాయి. అయిప్పటికీ ఉక్రెయిన్ పౌరులకు దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆశాకిరణంలా కన్పించారు. 
 
యుద్ధం నుంచి తమ దేశ ప్రజలను కాపాడుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అలాంటి నేత ఇప్పుడు విమర్శల పాలయ్యారు. తన సతీమణి ఒలెనా జెలెన్‌స్కాతో కలిసి దిగిన ఫొటోలే అందుక్కారణం. తీవ్ర సంక్షోభం వేళ ఆయన భార్యతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొనడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
ప్రఖ్యాత వోగ్‌ మ్యాగజైన్‌ పత్రికకు ఒలెనా జెలెన్‌స్కా ఇటీవల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందుకోసం జెలెన్‌స్కీ, ఆయన సతీమణి ఇద్దరూ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అధ్యక్ష భవనంలో వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని ఫొటోకు పోజిచ్చారు. దీంతో పాటు ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒలెనా యుద్ధ ట్యాంకులు, సైనికులతో కలిసి ఫొటో దిగారు.
 
ఈ ఫొటోలను ఉక్రెయిన్‌ ప్రథమ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 'వోగ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై ఫొటో రావడం గొప్ప గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు, విజేతలు కనే కల ఇది. వారి కల నెరవేరాలని నేను కోరుకుంటున్నా. అయితే దానికి యుద్ధం కారణం కాకూడదనే నా ఆశ. అయితే ఉక్రెయిన్‌లోని ప్రతి మహిళ ఇలా నా స్థానంలో కవర్‌పేజీలో ఉండాలని నేను కోరుకుంటున్నా. సైరన్ల మోతలో, శరణార్థుల శిబిరాల్లో దైన్యంగా బతుకుతున్న ప్రతి మహిళకు ఈ కవర్‌పేజీపై ఉండే హక్కు ఉంది' అని రాసుకొచ్చారు.
 
అయితే ఈ ఫొటోలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వీరిని సమర్థిస్తుండగా.. చాలా మంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. 'దేశంపై రష్యా బాంబులు జారవిడుస్తుంటే జెలెన్‌స్కీ ఇలాంటి ఫొటోషూట్‌లో పాల్గొన్నారని తెలిసి నమ్మలేకపోతున్నా. ఇది చాలా దిగ్భ్రాంతికరం' అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ మిస్సింగ్ కేసు ట్విస్ట్: నాన్నా నన్ను వెతకొద్దు, బెంగళూరులో వున్నా.. చనిపోను కానీ...