Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరిమ్యాచ్‌ న్యూస్‌ వ్యాన్‌ యాక్టివేషన్‌తో నూతన మొబైల్‌ రూపాన్ని పొందిన ప్రో కబడ్డీ లీగ్‌

Advertiesment
పరిమ్యాచ్‌ న్యూస్‌ వ్యాన్‌ యాక్టివేషన్‌తో నూతన మొబైల్‌ రూపాన్ని పొందిన ప్రో కబడ్డీ లీగ్‌
, శనివారం, 15 జనవరి 2022 (09:29 IST)
పరిమ్యాచ్‌ న్యూస్‌ ఇటీవలనే నూతన వ్యాన్‌ యాక్టివేషన్‌ ఫీచర్‌ను ఆవిష్కరించింది. తద్వారా ప్రో కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌) వీక్షణ అనుభవాలను మరింతగా వృద్ధి చేయడంతో పాటుగా వీక్షకులను మరింతగా ఈ క్రీడకు సన్నిహితంగా తీసుకురానుంది.

 
ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ పీకెఎల్‌ మ్యాచ్‌లు మొబైల్‌ వ్యాన్‌పై ప్రత్యేకంగా అమర్చిన 10 అడుగుల గీ6 అడుగుల స్ర్కీన్‌పై ప్రదర్శించనున్నారు. ఈ వ్యాన్‌లు ముంబై, పూనె, బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ, జైపూర్‌, కోల్‌కతా,  చండీఘడ్‌లలో ఎంపిక చేసిన మూడు ప్రాంతాలలో ఉంటాయి.

 
ఈ అతిపెద్ద స్ర్కీన్‌, మొబైల్‌, వర్ట్యువల్‌ అనుభవాలతో పాటుగా ఈ కంపెనీ తమ అభిమానులకు పలు బహుమతులను సైతం గెలుచుకునే అవకాశం అందిస్తుంది. వీటిలో బ్రాస్‌లెట్లు, మొబైల్‌ ఫోన్లతో పాటుగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు కూడా ఉంటాయి.

 
బ్రీత్‌ ఛాలెంజ్‌తో భాగంగా ప్రతి 15 నిమిషాలకు ఓమారు ఐదుగురు విజేతలకు తక్షణమే బహుమతులు అందజేస్తారు.
 
అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి 40 నిమిషాలకో మారు నిర్వహించే ఓ వినూత్నమైన పోటీలో క్యుఆర్‌కోడ్‌ స్కాన్‌ చేసి లక్కీడ్రాలో పాల్గొనవచ్చు. ఐదుగురు విజేతలుగా ఇక్కడ నిలువవచ్చు.
 
‘స్టైల్‌ మైనే రెహ్నే కా’ ఛాలెంజ్‌లో భాగంగా అభిమానులు ఆశ్చర్యకరమైన బహుమతులను అత్యధిక షేర్స్‌, లైక్స్‌ పొందిన ఎడల పొందవచ్చు. అత్యధిక లైక్స్‌ పొందిన ముగ్గురు విజేతలుగా నిలుస్తారు.
 
ఎనిమిది నగరాలలో జరిగే ఈ యాక్టివేషన్‌లో జరిగే బంపర్‌డ్రా ద్వారా అభ్యర్థులు మొబైల్‌ ఫోన్లను గెలువవచ్చు.
 
ఒక అదృష్టవంతుడైన విజేత రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను పొందవచ్చు. ఈ విజేతలను 20 జనవరి 2022న ప్రకటిస్తారు.
 
ప్రో కబడ్డీ లీగ్‌ అధికారిక స్పాన్సర్‌లలో పరిమ్యాచ్‌ న్యూస్‌ ఒకటి. ఈ స్ఫూర్తిదాయక గేమ్‌ను ఇది ప్రోత్సహించడంతో పాటుగా దేశవ్యాప్తంగా క్రీడాభిమానులకు దీనిని చేరువ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సంవత్సరం పీకెఎల్‌ లీగ్‌లో 12 టీమ్‌లు పాల్గొంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా హత్యకు కుట్ర... ఎవరైనా నచ్చకపోతే జగన్ తీసేస్తుంటారన్న ఆర్ఆర్ఆర్