Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో ఎంజీ మోటార్ ఇండియా తిరుపతిలో విక్రయ కేంద్రం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (23:23 IST)
దేశవ్యాప్తంగా కారు కొనుగోలు అనుభూతిని పునర్ నిర్వచించేందుకు తనకు గల కట్టుబాటును చాటిచెబుతూ ఎంజీ మోటార్ ఇండియా నేడిక్కడ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తన నూతన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది.

 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియం ఎస్‌యూవీలకు గల పటిష్ట మార్కెట్ శక్తిసామర్థ్యాలను గుర్తిస్తూ, ఈ నూతన కేంద్రం నగరంలోని మరింత మంది కొనుగోలుదారుల ప్రయాణ అవసరాలను తీర్చనుంది. ఈ నూతన షో రూమ్ కొనుగోలుదారులకు లుక్ అండ్ ఫీల్‌ను అందించడమే కాకుండా సంస్థ బ్రిటిష్ వారసత్వాన్ని కూడా ప్రతిబింబించనుంది.

 
నూతన షోరూమ్ ప్రారంభంతో ఈ కార్ల తయారీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో 12 టచ్ పాయింట్లను నిర్వహిస్తున్నట్లయింది. 2022 చివరినాటికి ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్యను 18కి పెంచాలని కూడా సంస్థ యోచిస్తోంది. ఈ బ్రాండ్ భారతదేశ వ్యాప్తంగా 307 టచ్ పాయింట్స్‌ను కలిగి ఉంది.

 
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా డీలర్ డెవలప్ మెంట్ డైరెక్టర్ శ్రీ పంకజ్ పార్కర్ మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మా కొనుగోలుదారులకు చేరువలో ఉండేందుకు రిటైల్ ఉనికిని విస్తరించాలన్న మా ప్రణాళికలకు అనుగుణంగానే ఎంజీ తిరుపతి ప్రారంభించబడింది. ఇది ఇక్కడి కొనుగోలుదారుల విక్రయ, సర్వీస్, విడిభాగాలు, యాక్సెసరీస్ అవసరాలను తీరుస్తుంది’’ అని అన్నారు.

 
ఈ సందర్భంగా ఎంజీ తిరుపతి డీలర్ ప్రిన్సిపల్ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘అగ్రగామి, భవిష్యత్ సన్నద్ధక బ్రాండ్‌గా, వినూత్నత, సాంకేతిక చోదిత ధోరణులతో ఎంజీ ఇప్పటికే భారతీయ వాహనరంగంలో సంచలనాలు సృష్టించింది. ఈ బ్రాండ్‌తో అనుబంధం మాకెంతో ఆనందదాయకం. ఎంజీ పటిష్ఠ బ్రిటిష్ వారసత్వం, సాంకేతికతపై దృష్టితో మేం ప్రయోజనం పొందనున్నాం. నెల్లూరు లోని కొనుగోలుదారులకు విశిష్ట వాహన రిటైల్ అనుభూతిని అందించనున్నాం’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments