Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడపలో ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు...

Advertiesment
కడపలో ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు...
, శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (08:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో ఘోరం జరిగింది. కారు ఒకటి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం కర్నాటక రాష్ట్రంలోని సిద్ధనూరు నుంచి తిరుమలకు వెళుతుండగా జరిగింది. 
 
కడప జిల్లాలోని ఒంటిమిట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, చెరువులో నుంచి కారును బయటకు తీయించారు. మృతులను చంద్రగుప్త, ఖేదర్‌నాథ్‌లుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం - రాష్ట్రంలో వంట నూనెల భగ్గు