Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్లో భీమ్లా నాయక్: కొడాలి నానికి షాక్ ఇచ్చిన పేర్ని నాని.. ఏమైంది?

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (23:05 IST)
విజయవాడ లోని ఒక ప్రైవేటు సినిమా థియేటర్‌ను ప్రారంభించేందుకు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు చేరుకున్నారు. అది కూడా భీమ్లా నాయక్ సినిమా ప్రదర్సితం చేయాలనుకున్న థియేటర్. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ సినిమా విడుదలైంది. తన సన్నిహితుడు నిర్మించిన విజయవాడలోని థియేటర్‌కు వెళ్ళారు కొడాలి నాని, పేర్నినాని.

 
అయితే థియేటర్‌ను ప్రారంభించిన తరువాత షోను ప్రారంభించారు నిర్వాహకులు. భీమ్లా నాయక్ సినిమా పేర్లు వేశారు. మంత్రి కొడాలి నాని ఫోన్ ఆపరేట్ చేస్తూ కూర్చున్నారు. కానీ పేర్ని నాని మాత్రం సినిమా చూడటం ప్రారంభించాడు. ఉన్నట్లుండి ఈల వేసి కొడాలి నాని తొడపై చరుస్తూ పిలిచారు. దీంతో షాకయ్యాడు కొడాలి నాని. సినిమా చూడంటూ చెప్పడం ప్రారంభించారు. దీంతో కొడాలి నాని కూడా సినిమా చూడడం మొదలెట్టారు.

 
ఆ తరువాత వెంటనే తేరుకున్న కొడాలి నాని ఇక వెళదామా అంటూ సినిమా ప్రారంభమైన 15 నిమిషాల్లోనే థియేటర్ నుంచి వెళ్ళిపోయారు. రాజకీయానికి, సినిమాకు ముడిపెట్టవద్దని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయినా సరే తన సినిమాలను ఎపిలో బెనిఫిట్ షోలు వేయనీయపోవడంతో అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు భీమ్లా నాయక్ సినిమాను తిలకించడంతో చర్చ ప్రారంభమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments