Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ సినిమాను జగన్ సర్కారు తొక్కేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

పవన్ సినిమాను జగన్ సర్కారు తొక్కేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
, శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (18:11 IST)
సినిమా టికెట్ ధరలపై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. భీమ్లానాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై వస్తున్న విమర్శలకు పేర్నినాని చెక్ పెట్టారు. 
 
పవన్ సినిమాను జగన్ ప్రభుత్వం తొక్కేయాల్సిన అవసరం ఏముందన్నారు. పవన్ కల్యాణ్ గురించి ఇంతగా ఆవేదన చెందుతున్న చంద్రబాబు, లోకేశ్.. ఏనాడైనా జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి ఒక్క మాటైనా మాట్లాడారా.. అని పేర్ని నాని ప్రశ్నించారు. 
 
చట్ట ప్రకారమే జగన్ ప్రభుత్వం నడుచుకుంటుందని తేల్చి చెప్పారు నాని. ఈ విషయంలో ఏర్పాటైన కమిటీ.. సోమవారం సమావేశం అవుతుందని.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తుందన్నారు. 
 
ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేస్తున్నప్పుడు.. అందుకు అనుగుణంగా ధరలు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత లేదా.. అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గురించి తాము 2014లో కానీ, 2019లో కానీ తాము పట్టించుకోలేదని.. ఇకపైనా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు నాని. 
 
చట్టాన్ని గౌరవించే పెద్ద మనసు పవన్ కల్యాణ్‌కు లేదని.. ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని.. శ్రీరంగ నీతులు మాత్రం బాగా చెబుతారని పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. 
 
ఏనాడైనా.. ప్రభాస్ సినిమా గురించో.. మహేష్ బాబు సినిమా గురించో చంద్రబాబు, లోకేశ్ ట్వీట్ చేశారా.. అని పేర్ని నాని ప్రశ్నించారు. వ్యవస్థలను దిగజార్చడంలో వారిని మించిన వారు లేరంటూ చంద్రబాబును ఉద్దేశించి కామెంట్లు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాయ్‌గ్లాస్‌ను మింగేసిన బీహార్ వ్యక్తి.. ఎలా తీశారంటే?