Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు గేర్లతో అదరగొట్టే హోండా కొత్త మోడల్...

honda cbr 150 sports bike
Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (21:46 IST)
కుర్రకారుకు రోడ్డుపై ఎన్ని రకాల బైకులు రయ్‌మంటూ దూసుకెళుతున్నా ఏదైనా బైక్ కొత్తగా కనిపించిందంటే చాలు మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. ఒక్కసారైనా వాటిని రైడ్ చేయాలని ఉత్సాహపడుతుంటారు. అందుకే మోటార్‌సైకిల్ కంపెనీలు యువతను దృష్టిలో ఉంచుకుని కొత్త కొత్త మోడళ్లను తయారు చేస్తుంటాయి. తాజాగా ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కూడా యువతను దృష్టిలో పెట్టుకునే మరో టూవీలర్‌‌ని తీసుకువచ్చింది. సీబీఆర్ 150 ఆర్ బైక్‌ను థాయ్‌లాండ్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇక దీని ధర దాదాపు రూ.2.15 లక్షలు.
 
ఇందులో ఆరు గేర్లు ఉంటాయి. అలాగే డబుల్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటుగా, కన్వెన్షనల్ ఫోర్క్స్ స్టాండర్డ్ ఫీచర్‌ ఉంటుంది. ముందు భాగంలో రెండు ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. సీబీఆర్ 650 ఆర్ బైక్‌ను ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. హోండా బ్రాండ్ పేరును తెలియజేసే విధంగా ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను ఏర్పాటు చేసారు. 
 
సీబీఆర్ 150 ఆర్ గ్రౌండ్ క్లియరెన్స్ 166 ఎంఎం అంటే ఈ బైక్‌ను రోజువారీ కార్యకలాపాలకు వినియోగించవచ్చు. 149 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంటజ్ ఉంటుంది. గరిష్ట పవర్ 17.1 హెచ్‌పీ @ 9000 ఆర్‌పీఎమ్, గరిష్ట టార్క్ 14.4 ఎన్‌ఎమ్ @ 7000 ఆర్‌పీఎమ్. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. బైక్ టాప్ స్పీడ్ గంటకు 135 కిలోమీటర్లు. ఈ బైక్ అతి త్వరలోనే భారత్ మార్కెట్లో ప్రవేశించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments