Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా

దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (20:36 IST)
భారతదేశంలో మరో అతిపెద్ద బ్యాంకు విలీనం జరిగింది. సోమవారం రోజున బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో దేనా, విజయా బ్యాంకులు విలీనమయ్యాయి. ఈ విలీనంతో దేశంలోనే రెండో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకుగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) అవతరించింది. అయితే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకు.
 
ఈ మూడు బ్యాంకుల వ్యాపారం దాదాపు రూ. 15లక్షల కోట్లు, ఇందులో రూ. 8.75 లక్షల కోట్లు డిపాజిట్ల రూపంలో ఉంది, అలాగే అడ్వాన్సుల రూపంలో 6.25లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ విలీనంతో బ్యాంక్ ఆఫ్‌ బరోడా పరిధిలోకి 9500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగులు, 12 కోట్ల మంది వినియోగదారులు వచ్చి చేరారు. 
 
ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఈ బ్యాంకుల విలీనం అంశాన్ని వెల్లడించింది. ఈ బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా ప్రతి 1000 విజయాబ్యాంక్‌ షేర్లకు 402 బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు లభిస్తాయి. అదే సమయంలో ప్రతి 1000 దేనా బ్యాంక్‌ షేర్లకు 110 బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి?