బంగారం ధరలు ఇలా పడిపోతున్నాయేంటి? ఇవాళ కూడా...

మంగళవారం, 26 మార్చి 2019 (18:53 IST)
దేశవ్యాప్తంగా స్థానిక బంగారు వర్తకులు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ బాగా తగ్గడంతో మంగళవారం బంగారం ధర కొంతమేరకు తగ్గింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడమే వెండి ధర తగ్గుదలకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పది గ్రాముల బంగారు ధర రూ.50 తగ్గి రూ.33,170కి చేరుకుంది. అలాగే వెండి కూడా కిలోకు రూ.100 తగ్గి రూ.39,100కు పడిపోయింది.
 
హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,170 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,640గా ఉంది. వెండి ధర కిలో రూ.41,300 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం పది గ్రాముల ధర రూ. 50 తగ్గి రూ. 33,170కి చేరుకుంది, అలాగే 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ.50 తగ్గి రూ.33 వేలకు పడిపోయింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆమె లవర్ కాదు రాక్షసి నాకు టార్చర్ చూపించింది..