Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమె లవర్ కాదు రాక్షసి నాకు టార్చర్ చూపించింది..

Advertiesment
ఆమె లవర్ కాదు రాక్షసి నాకు టార్చర్ చూపించింది..
, మంగళవారం, 26 మార్చి 2019 (18:30 IST)
ప్రస్తుతం యువకులు ప్రేమ పేరుతో ప్రేమించమని అమ్మాయిలను వేధించడం, యాసిడ్ పోస్తామని బెదిరించిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాగే తమను రక్షించమని పోలీసులకు ఫిర్యాదు చేయడం వింటూనే ఉన్నాం. మరి దీనికి పూర్తి రివర్స్‌లో ఇప్పుడు ఒక ఘటన జరిగింది. ఓ యువకుడు తన ప్రియురాలు వేధిస్తోందని..ఆమె నుండి తనను కాపాడాలంటూ పోలీసులను వేడుకున్నాడు.
 
లేకపోతే కిరోసిన్‌ని ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. చెప్పిన విధంగా ఒంటికి నిప్పు అంటించుకున్నాడు. అప్పటికీ పోలీసులు నమ్మలేదు. దీంతో పోలీసుల ఎదుటే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్ సిటీలోని లంగర్ హౌస్‌లో మార్చి 25వ తేదీ జరిగింది.
 
లంగర్ హౌస్ పరిధిలోని గొల్లబస్తీలో నివాసం ఉంటున్న ఆదిల్ అనే 25 ఏళ్ల యువకుడు డీఎల్ఎఫ్‌లో పని చేస్తున్నాడు. క్లాస్‌మేట్ అయిన యువతిని ప్రేమించాడు. విషయం కాస్త ఆమె తల్లిదండ్రులకు తెలిసిందనే భయంతో ఆదిల్‌పై ఫోన్‌లో తిట్ల పురాణం అందుకుంది. మాటిమాటికీ ఫోన్ చేసి తిడుతుండటంతో మనస్తాపానికి గురైన ఆదిల్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన లవర్‌పై కంప్లైంట్ చేసాడు.
 
అంతటితో ఆగకుండా తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో షాక్ అయిన పోలీసులు వెంటనే మంటలను ఆర్పారు. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆదిల్ పరిస్థితి బాగానే ఉందనీ.. అతడి కంప్లయింట్‌తో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా స్టాఫ్ అంతా పడుకున్నారు... నరసాపురంలో నాగబాబుకి చుక్కలు చూపిస్తా...