గతంలో ప్రభాస్, షర్మిలల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. వాటిపై ఐదేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఆ తర్వాత ఆ వార్తలు ఆగిపోయాయి. కట్ చేస్తే ఇటీవల ప్రభాస్‌తో లింక్ చేస్తూ షర్మిలపై వార్తలొచ్చాయి.
అవన్నీ గాలివార్తలేనని షర్మిల తేల్చేసింది. అసలు ప్రభాస్‌ని నేను ఒక్కసారి కూడా చూడలేదని, కలవలేదని కానీ మా మధ్య అనుబంధం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయని అలాంటి చెడు రాతలు రాసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని షర్మిల పోలీసులతో డిమాండ్ చేసింది.
గతంలో ప్రభాస్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి షర్మిలపై యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమరావతిలో షర్మిల మాట్లాడుతుండగా ఓ టీవీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనిని చూస్తున్న చౌటుప్పల్ రాంనగర్ ప్రాంతానికి చెందిన దివి హరిబాబు (39) మూడుసార్లు వరుసగా యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టులు చేశాడు.
అతడు పోస్టులు చూసిన మానవ హక్కుల మండలి వైస్ చైర్మన్ బి.అనిల్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడు హరిబాబును గుర్తించారు. చౌటుప్పల్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.