Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న బంగారం ధరలు

ఠాగూర్
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (09:31 IST)
దేశంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. ఫలితంగా మంగళవారం దీని ధర ఏకంగా రూ.300 రూ.85 వేలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, అమెరికా డాలరుతో రూపాయి మారకపు విలువ నానాటికీ క్షీణించడం వంటి కారణాలతో బంగారం ధరల పరుగు కొనసాగుతోంది. 
 
సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 స్వచ్ఛత బంగారం ధర రూ.400 పెరిగి రూ.85,300కు ఎగబాకింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ.400 పెరిగి రూ.84,900కు చేరుకుంది.
 
మరోవైపు, వెండి ధర కూడా కిలోకు రూ.300 లాభపడి రూ.96 వేలకు చేరుకుంది. ఎంసీఎక్స్ ఫ్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ నెల బంగారం కాంట్రాక్టుల ధర 10 గ్రాములకు రూ.461 పెరిగి రూ.82,765కు పెరగ్గా, కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం ఔన్సుకు 7.5 డాలర్ల మేర క్షీణించి 2,827 డాలర్లుగా నమోదైంది.
 
కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా టారిఫ్ విధింపు మన రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా చర్యలు వాణిజ్య యుద్ధానికి దారితీసిన నేపథ్యంలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 49 పైసలు క్షీణించింది. ఫలితంగా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.87.11గా నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments