Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిండ్‌వేర్ లిమిటెడ్ బాత్ అండ్ టైల్స్ వ్యాపారానికి కొత్త సీఈఓగా నిరుపమ్ సహాయ్‌

Advertiesment
Nirupam

ఐవీఆర్

, ఆదివారం, 26 జనవరి 2025 (23:19 IST)
భారతదేశంలోని ప్రముఖ బాత్‌వేర్ బ్రాండ్‌లలో ఒకటైన హిండ్‌వేర్ లిమిటెడ్, తన శానిటరీవేర్, కుళాయిలు, టైల్స్ వ్యాపారాల తదుపరి అభివృద్ధి దశకు నాయకత్వం వహించడానికి నిరుపమ్ సహాయ్‌ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. నిరుపమ్ విస్తృతమైన నాయకత్వ అనుభవాన్ని, విభిన్న రంగాల్లో వృద్ధి, లాభదాయకతను సాధనలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నారు. డిక్సన్ టెక్నాలజీస్ నుండి వచ్చి ఆయన హిండ్‌వేర్‌లో చేరారు, అక్కడ ఆయన లైటింగ్ సొల్యూషన్స్ బిజినెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఆయన కెరీర్‌లో ఫిలిప్స్ లైటింగ్, GE క్యాపిటల్, వర్ల్‌పూల్, ఏషియన్ పెయింట్స్‌లను తన నాయకత్వంతో ముందుకు నడిపించారు, వీటి ద్వారా ఆయన లైటింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పెయింట్స్, ఆర్థిక సేవల రంగాల్లో విస్తృతమైన అనుభవం గడించారు. తన నాయకత్వ చతురతను ప్రదర్శిస్తూ, నిరుపమ్ రెక్సామ్ డిక్సన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు GE మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డులో అద్భుత పనితీరును కనబరిచారు అలాగే ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ ఛాయిసెస్ కోసం సలహా మండలి సభ్యులుగా పనిచేస్తున్నారు.
 
కొత్త CEO ప్రకటన సందర్భంగా, హిండ్‌వేర్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సందీప్ సోమానీ మాట్లాడుతూ, "నిరుపమ్ నిరూపితమైన నాయకత్వం, భారతీయ మార్కెట్‌పై అతనికి గల లోతైన అవగాహన, ఆవిష్కరణలపై దృష్టి సారించే తత్వం హిండ్‌వేర్ బాత్‌వేర్ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో సహాయపడుతుంది. విశ్వసనీయమైన, వినూత్నమైన బ్రాండ్‌గా హిండ్‌వేర్ స్థానాన్ని ఆయన మరింత బలోపేతం చేస్తారని మేము విశ్వసిస్తున్నాం" అని అన్నారు. 
 
"భారతీయ గృహాలతో బలమైన అనుబంధం కలిగిన ఐకానిక్ బ్రాండ్ అయిన హిండ్‌వేర్‌లో చేరడం నాకు గౌరవంగా, ఉత్సాహంగా ఉంది" అని నిరుపమ్ సహాయ్ అన్నారు. "నాణ్యత, ఆవిష్కరణ, నమ్మకంలతో కూడిన హిండ్‌వేర్ యొక్క అద్భుతమైన వారసత్వం భవిష్యత్ వృద్ధికి బలమైన పునాదిని అందిస్తుంది. రోజురోజుకీ మారుతున్న కస్టమర్ అవసరాలను తీర్చడం అలాగే సరికొత్త అవకాశాలను ఉపయోగించుకోవడానికి ముందుచూపుతో ఆలోచించే విధానాన్ని అనుసరించడంపై ప్రధానంగా నా దృష్టి ఉంటుంది. స్థిరమైన వృద్ధిని కొనసాగించుట, వాటాదారులందరి కోసం విలువను సృష్టించడం కోసం ఈ బృందంతో కలిసి పనిచేసేందుకు నేను ఎదురు చూస్తున్నాను."

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖమ్మంలో తన సర్వీస్ ఫుట్‎ప్రింట్ విస్తరించిన ఇసుజు మోటార్స్ ఇండియా