Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖమ్మంలో తన సర్వీస్ ఫుట్‎ప్రింట్ విస్తరించిన ఇసుజు మోటార్స్ ఇండియా

Advertiesment
ISUZU

ఐవీఆర్

, ఆదివారం, 26 జనవరి 2025 (22:10 IST)
ఇసుజు మోటార్స్ లిమిటెడ్, జపాన్ యొక్క అనుబంధ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా తెలంగాణలో తన సర్వీస్ ఫుట్‎ప్రింట్‌ను విస్తరించింది. ఈరోజు ఖమ్మంలో కొత్త ఇసుజు అధీకృత సేవా కేంద్రము (ఏఎస్‎సి) ప్రారంభించింది. తన సేవలు, వినియోగదారు అనుభవాన్ని విస్తరిచడముపై బలమైన దృష్టితో, ఇసుజు మోటార్స్ ఇండియా ఖమ్మంలో బియాండ్ ఆటో కేర్‌ను నియమించింది. ఇది తెలంగాణలో ఇసుజు యొక్క 3వ టచ్‎ పాయింట్. ఈ సదుపాయము ఎస్‎వి పవర్ ప్లాజా, ఖమ్మంలో ఉంది. ఈ ప్రాంతములో ఇసుజు వినియోగదారులకు అంతరాయంలేని సహకారాన్ని అందించుటకు ఇక్కడ ఆధునిక పనిముట్లు, అసలైన విడిభాగాలు, ల్యూబ్స్, సుశిక్షితులైన సిబ్బంది ఉంటారు.
 
ఏఎస్‎సి సదుపాయము వినియోగదారుల సమక్షములో ఇసుజు మోటార్స్ ఇండియా, బియాండ్ ఆటో కేర్ నుండి కంపెనీ అధికారులచే ప్రారంభించబడింది. ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, శ్రీ. టోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా ఇలా అన్నారు, “అంతరాయం లేని సర్వీస్ సహకారాన్ని, వారి మొత్తం ప్రయాణములో మా వినియోగదారులతో అర్థవంతమైన సంబంధాన్ని నిర్ధారించుటకు దేశవ్యాప్తంగా మా నెట్వర్క్ యాక్సెస్‌ను విస్తరించాలని మేము కట్టుబడి ఉన్నాము. అసాధారణ వినియోగదారు సంతృప్తి మా సేవా భావజాలానికి కేంద్రకము, మా విశ్వసనీయమైన నెట్వర్క్ భాగస్వాముల మద్ధతుతో యాజమాన్య అనుభవాన్ని పెంచుటకు మేము కట్టుబడి ఉన్నాము. బియాండి ఆటో కేర్‌తో మా సహకారము ఈ ప్రాంతములో మేము అందించాలని కోరుకునే అంతరాయములేని, వ్యక్తిగతీకరించబడిన సేవా అనుభవాన్ని మెరుగుపరచుటకు మాకు తోడ్పడుతుంది”.
 
కేతినేని నరసింహారావు, డీలర్ ప్రిన్సిపల్ ఆఫ్ బియాండ్ ఆటోకేర్ ఇలా అన్నారు, "ఖమ్మంలో ఒక అధీకృత సేవా కేంద్రముగా ఇసుజు మోటార్స్ ఇండియాతో మా భాగస్వామ్యాన్ని ప్రకటించుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. అసాధారణ సేవను అందించడము, అత్యధిక స్థాయి వినియోగదారు సంతృప్తిని నిర్ధారించుట మా ప్రాథమిక దృష్టిగా నిలిచింది.”
 
ఒక అధీకృత ఇసుజు సేవా కేంద్రముగా, బియాండ్ ఆటో కేర్, ఇసుజు వాహనదారులకు అత్యుత్తమ సేవ, సహకారాన్ని అందించుటకు కట్టుబడి ఉంది. నాణ్యమైన సేవ, వినియోగదారు-కేంద్రక కార్యకలాపాల ద్వారా ఖమ్మం, పరిసర ప్రాంతాలలోని ఇసుజు వినియోగదారుల కొరకు యాజమాన్య అనుభవాన్ని పెంచడము దీని లక్ష్యము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించేందుకు, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రచారం