Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

Advertiesment
Ajith Kumar

ఠాగూర్

, ఆదివారం, 26 జనవరి 2025 (13:06 IST)
కోలీవుడ్ హీరో అజిత్ కుమార్.. వెండితెరపై రీల్ హీరోగా మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ రియల్‌ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఫలితంగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. 
 
దేశంలోనే వెండితెరపై హీరోయిజాన్ని ప్రదర్శించే హీరోలకు ఏమాత్రం కొదవలేదు. కానీ, నిజ జీవితంలో అలాంటి తెగువను ప్రదర్శించగల అతికొద్ది మంది హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. దక్షిణాదిన అగ్రహీరోగా ఎదిగిన అజిత్ కుమార్ 1971లో పి.సుబ్రమణ్యం, మోహిని దంపతులకు తంజావూరులో జన్మించారు.
 
ఆ తర్వాత వారి కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌కు వలస వచ్చింది. పదో తరగతితోనే చదువు ఆపేసిన అజిత్ ఎన్ఫీల్డ్ బైక్ గ్యారేజీలో మెకానిక్‌గా జీవితం ఆరంభించారు. తర్వాత సొంతంగా దుస్తుల ఎగుమతి వ్యాపారం చేసి నష్టపోయాడు. ఆ సమయంలోనే పలు దుస్తుల బ్రాండ్స్‌కు మోడల్‌గా కూడా పని చేశారు. 
 
1990లో 'ఎన్ వీడు ఎన్ కనవర్' చిత్రంలో విద్యార్థిగా చిన్న పాత్రలో తెరపై తొలిసారి కనిపించారు. 'ప్రేమ పుస్తకం' చిత్రంలో తొలిసారి హీరోగా అజిత్ అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమా విడుదలలో జాప్యం జరగడంతో ఆయన హీరోగా నటించిన తమిళ చిత్రం 'అమరావతి' ముందు విడుదలైంది. 1995లో వచ్చిన 'అసై' చిత్రం సూపర్ హిట్ కావడంతో అజిత్ ఇక వెనుదిరిగి చూడలేదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!