Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జై అజిత్.. జై విజయ్.. అంటూ జేజేలు కొడితే ఎలా.. మీ జీవితం మాటేంటి? ఫ్యాన్స్‌కు అజిత్ ప్రశ్న

Advertiesment
ajith kumar

ఠాగూర్

, బుధవారం, 15 జనవరి 2025 (14:46 IST)
తనతో పాటు.. ఇతర హీరోల అభిమానులకు అగ్ర నటుడు అజిత్ కుమార్ ఓ ప్రశ్నవేశారు. జై అజిత్.. జై విజయ్.. అంటూ జేజేలు కొడితే ఎలా.. మీ జీవితం మాటేంటి? అంటూ నిలదీశారు. మేం బాగానే ఉన్నాం.. మీరు కూడా బాగుండాలి కదా అని అన్నారు. హీరోలపై అభిమానం మంచిదే కానీ ముందు మన జీవితం గురించి ఆలోచించాలని సూచించారు. 
 
దుబాయ్ వేదికగా జరిగిన 24హెచ్ రేస్‌ పోటీల్లో ఆయనకు చెందిన కార్ రేసింగ్ జట్టు పాల్గొని విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అజిత్ మాట్లాడుతూ, జై అజిత్.. జై విజయ్.. అంటూ జేజేలు కొడితే నాకూ సంతోషంగానే ఉంటుంది. మరి మీ జీవితం మాటేమిటి? అందుకే, ముందు మీ జీవితం చూసుకున్నాకే ఏదైనా..' అంటూ హితవు పలికారు. 
 
సినిమాలు చూడండి, హీరోలను అభిమానించండి కానీ మీ జీవితం గురించి ఆలోచించకుండా అభిమానమే లోకంగా మార్చుకోవద్దని చెప్పారు. తన అభిమానులు సంతోషంగా ఉన్నారని తెలిసినప్పుడు తనకూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. పక్కవాడి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం వల్ల ఎవరికీ ఏమాత్రం ఉపయోగం ఉండదని చెప్పారు.
 
అదేసమయంలో ఇతరులను చూసి హైరానా పడొద్దని, పక్కవాడు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడనే ఆందోళన వద్దని అన్నారు. జీవితం చాలా చిన్నదని, ఏదో ఒకరోజు అందరమూ వెళ్లిపోతామని చెప్పారు. కష్టపడి పనిచేయండి, సంతోషంగా ఉండండని చెప్పారు. మన ముని మనవలు కూడా మనల్ని గుర్తుపెట్టుకోరనే విషయం గుర్తించాలన్నారు. జరిగిపోయిన దాని గురించి చింతించకుండా ఇప్పుడు ఈ క్షణాన్ని ఆస్వాదించాలని అభిమానులకు సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగనా రనౌత్‌కు బంగ్లాదేశ్ షాక్ : ఎమర్జెన్సీ మూవీపై నిషేధం!