Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియా పర్యటనలో చేసిన తప్పిదాలను పునరావృత్తం చేయొద్దు : గవాస్కర్

Advertiesment
sunil gavaskar

ఠాగూర్

, బుధవారం, 15 జనవరి 2025 (11:55 IST)
ఆస్ట్రేలియా పర్యటనలో చేసిన తప్పిదాలను పునరావృత్తం చేయొద్దని భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ హితవు పలికారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ క్రికెట్ జట్టు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. దీంతో పదేళ్ల తర్వాత బీజీ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వస్తుంది. 
 
ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కైనా ఒకేసారి జట్టును పంపించాలని సూచించారు. ఆస్ట్రేలియా పర్యటనలో చేసిన తప్పిదాలను పునరావృత్తం చేయకూడదన్నారు. ఇంగ్లండ్‌తో ఇంకా ఆరు నెలల సమయం ఉన్నందున అప్పుడైనా ఒకే బృందంగా టీమిండియా వెళ్లాలన్నారు.
 
కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ లేకుండా బ్యాచ్‌లుగా వెళితే అక్కడి జట్టుకు మనం ఏమి సందేశం ఇస్తున్నట్లు అని గవాస్కర్ ప్రశ్నించారు. ఆసీస్ ఓటమి తర్వాత బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. భారత జట్టు క్యాప్ తేలికగా ఇచ్చేస్తారనే భావన ప్రత్యర్ధి జట్టుకు రాకూడదన్నారు. 
 
కొంత మంది బౌలర్లను తీసుకుని వారికి జెర్సీ శిక్షణ ఇవ్వండి పర్లేదు కానీ క్యాప్ మాత్రం ఇవ్వొద్దని గవాస్కర్ సలహా ఇచ్చారు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నాటికి భారత కెప్టెన్ రోహిత్ జట్టుతో చేరడం, టీమ్ కూడా రెండు విడతలుగా అక్కడకు వెళ్లడం, వ్యక్తిగత కారణాలతో రోహిత్ పెర్త్ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోవడంపై అప్పుడే సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు పీవీ సింధు.. పెళ్లికి తర్వాత తొలి టోర్నీలోనే విన్