Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రామ్ చరణ్ 10లక్షలు సాయం

charan fans given chequ to victim family

డీవీ

, బుధవారం, 8 జనవరి 2025 (16:40 IST)
charan fans given chequ to victim family
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కాకినాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అరవపల్లి మణికంఠ (23), తోకాడ చరణ్ (22) కుటుంబాలను రామ్ చరణ్ అభిమానులు కలిశారు.  చరణ్ తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఇరు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. చరణ్ సూచన మేరకు అభిమానులు వారి కుటుంబాలకు రూ. 10 లక్షల సహాయం (RTGS) అందజేసి, ఈ కష్ట సమయంలో నావిగేట్ చేయడంలో వారికి అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
 
webdunia
charan fans given chequ to victim family
ఇటీవలే అల్లు అర్జున్ అభిమానులు సంథ్య థియేటర్ లో ఒకరు చనిపోయిన సంగతి తెలిసిందే. గతంలోనూ హీరోల ప్రీరిలీజ్ లకు వచ్చి ఇంటికి తిరిగివెళుతూ కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. ఇకనుంచి ఇటువంటివి భారీ ఎత్తున జరగకుండా పరిమితంగా ఓ ప్రణాళిక ప్రకారం జరగాలని ఛాంబర్ భావిస్తోంది. దీనిపై కార్యవర్గ సమావేశంలో తగు ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందగత్తెనుకాను, ఆరుడుగులు వుండనంటున్న శ్రద్ధా శ్రీనాథ్