Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాతాళానికి పడిపోతున్న బంగారం, వెండి ధరలు...

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (19:51 IST)
ఫిబ్రవరి నెలలో పెరిగిన బంగారం ధరలు మార్చి నెల ప్రారంభం నుండి తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర మునుపటి రెండు రోజుల క్రమంలోనే శుక్రవారం కూడా తగ్గింది. దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.260 తగ్గి రూ.33,110కి పడిపోయింది. జ్యూయలర్లు, రిటైలర్ల నుండి డిమాండ్ తగ్గినందున ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదేవిధంగా వెండి ధరలు కూడా తగ్గడంతో కేజీ వెండి ధర రూ.130 తగ్గి, రూ.39,170కి పడిపోయింది.
 
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.260 తగ్గి, రూ.33,110కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 తగ్గి రూ.32,940కి పడిపోయింది. ఇక కేజీ వెండి రూ.130 క్షీణించడంతో రూ.39,170కి పడిపోయింది. 
 
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,090 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,560గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.41,100కి తగ్గింది. మరి మార్చి మొత్తం ఇదే ట్రెండ్ కొనసాగితే పది గ్రాముల బంగారం ధర 30,000లోపు వచ్చే అవకాశం ఉండటంతో మధ్యతరగతి ప్రజల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments