వంశీకి క్లాస్ పీకిన మ‌హేష్‌..!

బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (22:27 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మ‌హ‌ర్షి. ఈ సినిమాకి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌హేష్ - పూజా హ‌గ్డే జంట‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అయితే... ఈ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆ త‌ర్వాత అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న ఏప్రిల్ 5న కాకుండా ఏప్రిల్ 25న రిలీజ్ చేయ‌నున్నాం అని నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు ప్ర‌క‌టించారు. 
 
ఇప్పుడు ఏప్రిల్ 25న కూడా థియేట‌ర్లోకి మ‌హ‌ర్షి వ‌చ్చేలా లేద‌ని టాక్ వ‌స్తుంది. దీనికి కార‌ణం డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. అవును.. వ‌ర్క్ చాలా స్లోగా అవుతుంద‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న మ‌హేష్ వంశీని పిలిచి బాగా క్లాస్ తీసుకున్నాడ‌ట‌. 
 
ఏది ఏమైనా అనుకున్న ప్ర‌కారం ఏప్రిల్ 25నే రిలీజ్ చేయాలి అంటూ కాస్త గ‌ట్టిగానే చెప్పాడ‌ట‌. దీంతో వంశీ వ‌ర్క్‌లో స్పీడు పెంచాడు అంటూ ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్ వినిపిస్తుంది. మ‌రి... అఫిష‌యల్‌గా మ‌రోసారి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నా లైఫ్‌లో ఆయన ఉండాలి... ఓవియా సంచలన వ్యాఖ్యలు