Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ దంపతులకు జాక్‌పాట్ : రూ.2.5 కోట్ల పెట్టుబడి.. ఒక్క రోజులో రూ.10 కోట్లకు చేరిక

ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (12:17 IST)
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ - అనుష్క దంపతులకు జాక్‌పాట్ తగిలింది. వారు కలిసి పెట్టిన పెట్టుబడి ఒక్క రోజులోనే నాలుగు రెట్లు పెరిగిపోయింది. రూ.2.5 కోట్ల పెట్టుబడి పెడితే అది ఏకంగా రూ.10 కోట్లకు చేరింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గో డిజిట్ జనవల్ బీమా కంపెనీ గురువారం స్టాక్ మార్కెట్‌లో దూకుడు ప్రదర్శించింది. స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయిన వెంటనే దూసుకునిపోయింది. దాని షేర్ల ధరలు రూ.300 మార్క్‌ను దాటేశాయి. దీంతో టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ అనుష్కల పెట్టుబడులు కూడా ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. 
 
గో డిజిట్ షేరును కోహ్లీ రూ.75 చొప్పున మొత్తం 2,66,667 షేర్లను కొనుగోలు చేశాడు. ఈ మొత్తం విలువ రూ.2 కోట్లు. అనుష్క శర్మ రూ.50 లక్షలతో 66,667 షేర్లు కొనుగోలు చేస్తే వాటి ధర ఇపుడు రూ.2.5 కోట్లకు పెరిగింది. విరాట్ రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన షేర్ల ధరలు రూ.8 కోట్లు అయ్యాయి. అంటే వీరిద్దరూ కలిసి మొత్తంగా రూ.2.5 కోట్లు పెట్టుబడిపెట్టగా ఒక్క రోజులోనే వాటి విలువ రూ.10 కోట్లకు చేరింది. అంటే వారి పెట్టుబడికి నాలుగింతలు ప్రతిఫలం లభించింది. 
 
కంపెనీకి విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గానూ ఉన్నాడు. ఐపీవోలో భాగంగా గోడిజిట్ రూ.1125 కోట్ల విలువైన 5.48 కోట్ల షేర్లను ఆఫర్ లే కింద ఐపీఓలో భాగంగా విక్రయించింది. సెలెబ్రిటీలు పెట్టుబడులు పెట్టిన సంస్థలు లిస్టింగ్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments