Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు!!

Advertiesment
Kohli

ఠాగూర్

, శుక్రవారం, 10 మే 2024 (09:44 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ధర్మశాల వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులో మెరుపు ఇన్నింగ్స్‌తో కింగ్ కోహ్లీ కీలక పాత్ర పోషించారు. 47 బంతుల్లో కోహ్లీ 7 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో ఏకంగా 92 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పంజాబ్ విరాట్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే ఈ ఫీట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లపై నమోదు చేసిన కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఇలా మూడు ఐపీఎల్ జట్లపై 1000 పరుగుల మార్క్ అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 
 
ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన రన్ మెషీన్ 70.44 సగటు, 153.51 స్ట్రైక్ రేటుతో 634 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్థ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 30 సిక్సర్లు, 55 ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ తన వద్దే ఉంచుకున్నాడు. ఇక విరాట్ ఇదే ఫామ్‌ను వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లోనూ కొనసాగించాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 
 
ద్వారంపూడికి వెన్నులో వణుకు పుట్టిస్తున్న పవన్.. కాకినాడలో జనసేనాని రోడ్‌షోకు పర్మిషన్ నో!! 
 
కాకినాడ సిటీ ఎమ్మెల్యే, వైకాపా నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. గత కొంతకాలంగా ద్వారంపూడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న పవన్... ద్వారంపూడిని మాఫియా డాన్‌గా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో పవన్ కళ్యాణ్ రోడ్‌షో పాటు బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అయితే, ద్వారంపూడి తన అధికారాన్ని ఉపయోగించి పవన్ సభలకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్‌షో, సభకు టీడీపీ, జనసేనలు దరఖాస్తులు చేసుకున్నాయి. అయితే, అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు పేర్కొంటూ అనుమతి ఇవ్వలేదు. 
 
దీంతో పవన్ పర్యటన రూట్ మార్చి ఎనిమిది ప్రాంతాల్లో దరఖాస్తు చేసినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వైకాపా అధికార దుర్వినియోగం, పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నా ఏమాత్రం లెక్క చేయడం లేదు. అనుమతుల కోసం అర్థరాత్రి 12 గంటల వరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు పడిగాపులు కాశారు. అయినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి కారణం... కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తే తాను చిత్తుగా ఓడిపోతానన్న భయం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలో బలంగా పాతుకుపోయింది. దీంతో తన అధికార బలంతో కాకినాడలో పవన్ పర్యటనకు రాకుండా అడ్డుకుంటున్నారని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కింగ్ కోహ్లీ అద్భుత రికార్డు.. పంజాబ్‌పై 1000 పరుగులు పూర్తి