Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత

ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (11:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. గురువారం ఆయన పార్టీ నేతలతో సమావేశమై మాట్లాడుతుండగా ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయారు. గుడివాడ పట్టణంలోని రాజేంద్ర నగర్‌లోని తన నివాసంలో ఆయన నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతుండగా ఉన్నట్టుండి సోఫాలో ఒరిగిపోయారు. అయితే, నానికి జ్వరం రావడంతో నీరసించి అలా జరిగి ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నట్టు నాని ఓ వీడియో రిలీజ్ చేశారు. 
 
ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలపై ప్రభావమెంత? 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే ఆదివారానికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఆదివారం సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్, మిజోరం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే మిగతా తీర ప్రాంత రాష్ట్రాలపై ప్రభావం తక్కువగానే ఉంటుందని పేర్కొంది.
 
ప్రస్తుత నైరుతికి సీజన్‌కు సంబంధించి రుతుపవనాలకు ముందు ఏర్పడుతున్న మొట్టమొదటి తుఫాన్ ఇదేనని అధికారులు తెలిపారు. హిందూ మహా సముద్రంలో ఏర్పడే తుఫానులకు పెట్టే పేర్ల క్రమంలో.. ప్రస్తుతం ఉన్న పేరు రెమల్. దీనిని ఈ తుఫానుకు పెట్టనున్నట్టు వెల్లడించారు.
 
కాగా, బంగాళాఖాతంలో అల్పపీడనం పరిస్థితిపై భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త మోనికా శర్మ స్పందిస్తూ, 'మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా వాయుగుండంగా మారుతుంది. తర్వాత మరింత బలపడి శనివారం ఉదయానికల్లా తుఫానుగా, ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారుతుంది. ఆదివారం సాయంత్రానికల్లా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది' అని పేర్కొన్నారు. 
 
మరోవైపు, అల్పపీడనం తుఫానుగా మారాక గంటకు 102 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వారు చేపల వేట, ఇతర ఏ పనులపైనా సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments