Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజా రౌండ్‌ ఫైనాన్సింగ్‌లో 165 మిలియన్‌ డాలర్లను సమీకరించిన డీల్‌షేర్‌

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (18:43 IST)
సోషల్‌ ఈ-కామర్స్‌ స్టార్టప్‌ డీల్‌షేర్‌ నేడు తమ సిరీస్‌- ఈ ఫండ్‌ రౌండ్‌లో భాగంగా 165 మిలియన్‌ డాలర్లను సమీకరించినట్లు వెల్లడించింది. ఈ రౌండ్‌లో నూతనంగా డ్రాగనీర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ గ్రూప్‌, కోరా క్యాపిటల్‌ మరియు యునిలీవర్‌ వెంచర్స్‌ను స్వాగతించగా, ప్రస్తుత మదుపరులు అయినటువంటి టైగర్‌ గ్లోబల్‌, ఆల్ఫా వేవ్‌ గ్లోబల్‌ (ఫాల్కన్‌ ఎడ్జ్‌) కూడా ఈ రౌండ్‌లో పెట్టుబడులు పెట్టాయి.

 
ఈ కంపెనీ తమ వినియోగదారుల సంఖ్యతో పాటుగా ఆదాయాన్ని సైతం గణనీయంగా వృద్ధి చేసుకోవడంతో పాటుగా త్వరలోనే ఒక బిలియన్‌ డాలర్లను చేరుకోనుందని అంచనా. ఈ రౌండ్‌లో సమీకరించిన నిధులను సాంకేతికత, డాటా సైన్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వినియోగించనున్నారు. అదే రీతిలో తమ లాజిస్టిక్స్‌ మౌలిక వసతులను పది రెట్లు విస్తరించడంతో పాటుగా భౌగోళికంగా తమ చేరికను సైతం విస్తరించనుంది. అదనంగా చెప్పుకోతగ్గ రీతిలో తమ ఆఫ్‌లైన్‌ స్టోర్‌ ఫ్రాంచైజీ నెట్‌వర్క్‌ను సైతం ఏర్పాటు చేయనుంది.

 
తాజా ఫండింగ్‌ రౌండ్‌ గురించి డీల్‌షేర్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో వినీత్‌ రావు మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్‌ కంపెనీలలో ఒకటి డీల్‌ షేర్‌. గత సంవత్సర కాలంలో మా ఆదాయం, వినియోగదారల సంఖ్య 13 రెట్లు వృద్ధి చెందడంతో పాటగా లాభదాయకత సైతం వృద్ధి చెందింది. పది మిలియన్లకు పైగా వినియోగదారులతో 10 రాష్ట్రాలలో 100 నగరాలకు మా కార్యకలాపాలను విస్తరించనున్నాము. దేశవ్యాప్తంగా 5వేల ఉద్యోగావకాశాలను మా సంస్ధ సృష్టించింది’’ అని అన్నారు.

 
‘‘మా ప్రతిష్టాత్మక కార్యక్రమం డీల్‌షేర్‌ దోస్త్‌ ద్వారా 1000 కమ్యూనిటీ లీడర్స్‌తో కూడిన నెట్‌వర్క్‌ను మేము సృష్టించాము. ప్రభావవంతమైన, అత్యధికంగా విస్తరించతగిన సరఫరా చైన్‌ను ఇది సాధ్యం చేస్తుంది. ఈ రౌండ్‌ ద్వారా సమీకరించిన నిధులను సాంకేతికతలో అధికంగా పెట్టుబడులు పెట్టడంతో పాటుగా సరఫరా చైన్‌  మెరుగుపరచడం, దేశవ్యాప్తగా మా ఉనికి విస్తరించడం చేయనున్నాము. అత్యున్నత శ్రేణి సాంకేతికతలను సొంతం చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టడంతో పాటుగా మాస్‌ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న మార్క్యూ బ్రాండ్లపై సైతం పెట్టుబడులు పెట్టనున్నాం’’ అని రావు అన్నారు.

 
టైగర్‌ గ్లోబల్‌ భాగస్వామి గ్రిఫిన్‌ స్ర్కోయిడర్‌ మాట్లాడుతూ ‘‘అత్యంత వేగంగా డీల్‌షేర్‌ వృద్ధి చెందడంతో పాటుగా ఆకర్షణీయమైన రీతిలో వినియోగదారులను సైతం పొందింది. టియర్‌ 2, టియర్‌ 3 నగరాలలో విస్తరిస్తుండటం వల్ల భారతదేశంలో నూతన ఈ-కామర్స్‌ వృద్ధికి తోడ్పడనుంది’’ అని అన్నారు.

 
కంపెనీ వృద్ధి గురించి సౌర్జ్యేందు మెద్దా, ఫౌండర్‌, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, డీల్‌షేర్‌ మాట్లాడుతూ, ‘‘మా వ్యాపారంలో అత్యధిక వృద్ధిని మేము చూస్తున్నాము. ఈ సంవత్సరం, 20 రాష్ట్రాలలో 200 నగరాలకు మేము విస్తరించనున్నాం. అలాగే మా వార్షిక ఆదాయంను మూడు బిలియన్‌ డాలర్ల చొప్పున వృద్ధి చేయడం ద్వారా నిర్వహణ లాభదాయకతను సైతం వృద్ధి చేయనున్నాం. రాబోయే 12 నెలల కాలంలో 50 మిలియన్‌ నూతన వినియోగదారులను జోడించనున్నాం’’ అని అన్నారు.

 
అల్ఫా వేవ్‌ గ్లోబల్‌ కో-ఫౌండర్‌ అండ్‌ పార్టనర్‌ నవరోజ్‌ డీ ఉద్వాడియా మాట్లాడుతూ, ‘‘ఈ రౌండ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల సంతోషంగా ఉన్నాము. డీల్‌షేర్‌కు మా మద్దతు కొనసాగించనున్నాము. తమ వినియోగదారులకు అసాధారణ విలువను డీల్‌షేర్‌ అందిస్తుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

లక్కీ భాస్కర్ విన్నరా? కాదా? - లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ

డిసెంబర్‌లో నాగచైతన్య - శోభితల వివాహం.. ఎక్కడ జరుగుతుందంటే?

ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడిగా ప్రిన్స్ మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

ప్రియా.... నను క్షమించవా ఈ జన్మకి ఈ ఎడబాటుకి

తర్వాతి కథనం
Show comments