Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించిన యుఎస్‌ కేంద్రంగా కలిగిన ఈవీగేట్‌వే

Advertiesment
EVGATEWAY EXPANDS
, గురువారం, 27 జనవరి 2022 (21:04 IST)
సుప్రసిద్ధ టర్న్-కీ విద్యుత్‌ వాహన (ఈవీ) మౌలిక వసతుల పరిష్కారాల ప్రదాత, యుఎస్‌ఏలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కలిగిన ఈవీగేట్‌వే నేడు భారతదేశంలో తమ కార్యకలాపాలను ఆరంభించినట్లు వెల్లడించింది. యునైటెడ్‌ స్టేట్స్‌తో పాటుగా లాటిన్‌ అమెరికా, యూరోప్‌, ఆసియా, మిడిల్‌ ఈస్ట్‌ మార్కెట్‌లలో అగ్రగామి ఈవీ సంస్థగా ఇప్పటికే వెలుగొందుతుందీ సంస్థ. ఇప్పుడు భారతదేశంలో తమ కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా ఈ కంపెనీ భారతదేశపు ఈవీ మార్కెట్‌ ప్రాంగణంలో ఆవిష్కరణలను అందించడంతో పాటుగా డ్రైవర్లతో పాటుగా చార్జర్‌ యజమానులకు సైతం అతి సులభంగా వినియోగించతగిన పరిష్కారాలను అందించడం ద్వారా విద్యుత్‌ వాహన స్వీకరణను మరింతగా పెంచడం చేయనుంది.

 
తెలివైన, అత్యాధునిక ఈవీ చార్జింగ్‌ నిర్వహణ సేవలను అన్ని పరిశ్రమల్లోని వినియోగదారులకు, వైవిధ్యమైన చార్జింగ్‌ అవసరాలకు ఈవీ గేట్‌వే అందిస్తుంది. చార్జర్‌ మేనేజ్‌మెంట్‌ ఫీచర్లు (ఓసీపీపీ- ఓసీపీఐ ఫంక్షనాలిటీ, వెబ్‌ పోర్టల్‌, డిమాండ్‌ రెస్పాన్స్‌ సామర్థ్యం, డ్రైవర్‌ ఫేసింగ్‌ మొబైల్‌ యాప్‌, స్మార్ట్‌ చార్జింగ్‌, ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు మొదలైనవి)ను ఈవీ వాహనాలు, విద్యుత్‌ నిర్వహణ వ్యవస్థలు, టెలిమ్యాటిక్స్‌ ఫంక్షనాలిటీలతో మిళితం చేయడం ద్వారా ఈవీ గేట్‌వే ఇప్పుడు భారతదేశపు మార్కెట్‌కు అత్యంత సమర్థవంతమైన, వినూత్నమైన ఈవీ పరిష్కారాలను పరిశ్రమలో అందిస్తుంది.

 
ఈ విస్తరణ గురించి శ్రీ రెడ్డి మర్రి, ప్రెసిడెంట్‌ ఈవీగేట్‌వే మాట్లాడుతూ, ‘‘టెలిమాటిక్స్‌, వీ2జీ, సీఆర్‌ఎం వంటి సాంకేతికతలను మా సాస్‌ వేదికలతో మిళితం చేయడంలో మా అంతర్జాతీయ అనుభవం అన్ని వర్గాల ఖాతాదారులకు ప్రభావవంతమైన పరిష్కారాలను అందించడం మరియు మారుతున్న వాతావరణాన్ని స్వీకరించడంలో మాకు తోడ్పడుతుంది’’ అని అన్నారు.

 
‘‘భారతదేశంలో మా డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో మా ఉత్పత్తులలో గణనీయమైన మొత్తాన్ని అభివృద్ధి  చేస్తున్నాం. ఇక్కడ నుంచి మా ఉత్పత్తులను మరింతగా విస్తరించనున్నాం. యుఎస్‌ టీమ్‌తో పాటుగా మేము 24 గంటల మద్దతును ఉత్పత్తుల కోసం హైదరాబాద్‌ (యుఎస్‌ బృందంతో మా ఉమ్మడి ప్రయత్నాల ద్వారా హైదరాబాద్‌ నుంచి మేము 24 గంటల మద్దతును అందించనున్నాం)నుంచి అందించనున్నాం. ఇది మా అందరికీ గర్వకారణమైన క్షణం. ఎందుకంటే, ఎట్టకేలకు మా ఉత్పత్తులను ఇండియాకు తీసుకురావడంతో పాటుగా భారతదేశపు ఈవీ కార్యక్రమాలకు మద్దతునందిస్తున్నాము’’ అని ఉదయ్‌ చాగరి, హెడ్‌ ఆఫ్‌ ఈవీగేట్‌వే ఇండియా అన్నారు.

 
‘‘ఈవీ గేట్‌వే యొక్క సాస్‌ ఈవీ చార్జింగ్‌ పరిష్కారాలు భారతదేశంలో రీజనల్‌ క్లౌడ్‌లో ఆవిష్కరించడంతో పాటుగా నిర్వహిస్తున్నారు. తద్వారా వృద్ధి చెందుతున్న డాటా సెక్యూరిటీ అవసరాలను సైతం తీరుస్తుంది. ఈవీ గేట్‌వే ఇప్పుడు భారతీయ ఖాతాదారులకు వైట్‌ లేబుల్‌ పరిష్కారాలను అందిస్తుంది. ఇది తమ వ్యక్తిగత బ్రాండ్లను వృద్ధి చేసేందుకు తోడ్పడుతుంది. ఫ్లీట్‌ టెలిమాటిక్స్‌, పేమెంట్‌ గేట్‌వేస్‌, నెట్‌వర్క్స్‌ నడుమ ఓసీపీఐ రోమింగ్‌, లోడ్‌ ఆప్టిమైజేషన్‌, ఆన్‌సైట్‌ సోలార్‌ మరియు బ్యాటరీ స్టోరేజీ ఇంటిగ్రేషన్‌ వంటివి మిళితం చేయడంలో మా అంతర్జాతీయ అనుభవం వంటివి విభిన్నమైన వినియోగదారుల అవసరాలను తీర్చడంలో సౌకర్యమూ అందిస్తుంది. పారామీటర్‌ ఆధారిత విధానం తక్కువ ప్రయత్నంలో  మరింత మంది ఖాతాదారులను సొంతం చేసుకోవడంలో తోడ్పడుతుంది’’ అని నిశాంత్‌ కలిదిండి, వీపీ- టెక్నాలజీ, ఈవీ గేట్‌వే అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒమిక్రాన్ వచ్చిందా? ఏమో? కనిపెట్టడం ఎలా?