Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అందంగా లేదని మరో యువతి మోజులో పడ్డాడు, నిజం తెలిసిన యువతి ఛీ కొట్టింది, అంతే...

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (18:33 IST)
పెళ్ళయ్యింది. భార్య అందంగా లేదని అతడి అభిప్రాయం. ఇంటికి వెళితే భార్య ముఖం చూసేవాడు కాదు. సంసారం చేయడం మానేశాడు. ఇంటికి ఎందుకు రావడం లేదురా అంటూ తల్లిదండ్రులు అడుగుతున్నా సమాధానం మాత్రం చెప్పేవాడు కాదు. ఉన్న కొద్దిసేపు ముభావంగానే ఉండేవాడు. తనలోని బాధను తనలోనే దాచుకుని ఒక్కసారిగా సెల్ఫీ వీడియో ద్వారా బహిర్గతం చేశాడు. తనువు చాలించాడు.

 
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం శివారు కొప్పిశెట్టివారి పాలెంలో విషాదం చోటుచేసుకుంది. అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు గత కొంతకలంగా ఒక అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. 

 
ప్రేమ పేరుతో తనవద్ద నుంచి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు వేరే పెళ్ళి చేసుకుంటోందని ఆ యువకుడు సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఒక వీడియోను రెడీ చేసి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో తను తన ప్రియురాలు కలిసి ఉన్న వీడియోలు, ఫోటోలను షేర్ చేశాడు.

 
అమ్మాయి మోసం చేసినందుకే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీశాడు. అయితే గతంలోనే ఈ యువకుడికి పెళ్ళయింది. భార్య అందంగా లేదని ఒక యువతిని ప్రేమించాడు. ఆ యువతితో సహజీవనం కూడా చేశాడు. ఐతే అతడికి ఇప్పటికే పెళ్లయిందని తెలిసిన యువతి అతడిని దూరం పెట్టేసింది. దాంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

లక్కీ భాస్కర్ విన్నరా? కాదా? - లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ

డిసెంబర్‌లో నాగచైతన్య - శోభితల వివాహం.. ఎక్కడ జరుగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

ప్రియా.... నను క్షమించవా ఈ జన్మకి ఈ ఎడబాటుకి

తర్వాతి కథనం
Show comments