పక్కా రా తాగుతున్న నవదీప్ ఎందుకోసం!
Publish Date: Wed, 26 Jan 2022 (18:09 IST)
Updated Date: Wed, 26 Jan 2022 (18:13 IST)
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి నవదీప్. పలు సినిమాలు చేసిన ఆయన తన తాజా విశ్వరూపం ఇలా చూపిస్తున్నాడు. పచ్చి మందు తాగుతూ అర్జున్ రెడ్డి తరహాలో కనిపిస్తున్న నవదీప్ 2.0గా కొత్త అవతారంతో కనిపించనున్నట్లు బుధవారంనాడు పుట్టినరోజు సందర్భంగా ఫొటో విడుదల చేశాడు. విలన్ పాత్రలు చేయాలనుకునే ఆయనకు చందమామ సినిమాలో చిన్న నెగెటివ్ షేడ్ చేశాడు. ఆ తర్వాత హీరోగా చేశాడు. కొంతకాలం తన స్వంత వ్యాపారాలు చూసుకుంటున్న నవదీప్ ఈసారి లవ్ మౌళి అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. నైరా క్రియేషన్స్ బ్యానర్ పై అవనీంద్ర దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
సరికొత్తగా నవదీప్ 2.0 గా కనిపించబోతున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా అవనీంద్ర చూసుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
తర్వాతి కథనం