Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త వేధింపులు: మాజీ ప్రియుడిని పెళ్లాడతానంటూ వెళ్లిపోయిన భార్య, ఆ తర్వాత?

Advertiesment
భర్త వేధింపులు: మాజీ ప్రియుడిని పెళ్లాడతానంటూ వెళ్లిపోయిన భార్య, ఆ తర్వాత?
, శనివారం, 29 జనవరి 2022 (12:24 IST)
పెళ్ళయి మూడునెలలే. భర్త తాగుడుకు బానిసై భార్యతో సంసారం చేయలేదు. భర్త తాగొచ్చి కొడుతూ ఉండడంతో మాజీ ప్రియుడే ఆమెకు గుర్తుకు వచ్చాడు. అందులోను పనీపాటా లేకుండా భర్త తిరుగుతుండడం.. ఎప్పుడూ తాగడమే పనిగా పెట్టుకోవడంతో ఆ వివాహిత తట్టుకోలేకపోయింది. అత్త, మామలకే తాను పడుతున్న వేదనను చెప్పుకుంది.

 
తెలంగాణా రాష్ట్రం సిద్థిపేట అర్బన్ మండలం మిట్టపల్లికి చెందిన పల్లె విద్య, చిన్న కోడూరు మండలం రామునిపట్లకు చెందిన సంతోష్ కుమార్‌లు ప్రేమించుకుంటున్నారు. అయితే సుధీర్ అనే వ్యక్తితో విద్యను ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు.

 
సుధీర్ తల్లిదండ్రులు ఆస్తిపరులు. సుధీర్ ఏ పనిచేయకపోయినా ఆస్తి ఉండటంతో నమ్మకంతో వివాహం చేశారు. అయితే సుధీర్ పెళ్ళికి ముందు నుంచే తాగుడుకు బానిసయ్యాడు. ఇష్టానుసారం తాగుతూ తిరిగేవాడు. ఇంటికి వస్తే గొడవ. భార్యను కొట్టడం.. పెళ్ళయిన మాటే కానీ భార్యను దగ్గరకు తీసుకోలేదు. దీంతో విద్య తట్టుకోలేకపోయింది. అత్తమామలకు అసలు విషయాన్ని చెప్పింది. పెళ్ళయింది కానీ ఇంతవరకు నీ కొడుకు నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోలేదని చెప్పింది. 

 
తను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని.. మాజీ ప్రియుడితో కలిసి ఉంటానంది. నేరుగా ప్రియుడికి ఫోన్ చేసింది. విధి నిర్వహణలో ఉన్నాడు సంతోష్ కుమార్. సాయంత్రానికి ఇంటికి వస్తానన్నాడు. అయితే అప్పటికే ప్రియుడి ఇంటికి వెళ్ళింది విద్య. 

 
సంతోష్ తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు పంపేశారు. ప్రియుడికి ఆ విషయాన్ని చెప్పి ప్రియుడితో కలిసి తన ఇంటి ముందే ధర్నాకు కూర్చుంది ప్రియురాలు. తనకు సంతోష్ కుమార్‌కు వివాహం చేయాలని ఆందోళనకు దిగింది. ఈ వ్యవహారం కాస్త ప్రస్తుతం పోలీస్టేషన్ వరకు వెళ్ళింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..