ఎయిర్ఇండియాను తిరిగి టాటా గ్రూప్‌కు అప్పగించింది కేంద్రం. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఈ విమానయాన సంస్థ తన పుట్టింటికి చేరింది. 89ఏళ్ల కిందట వారు స్థాపించిన ఈ కంపెనీ.. 68ఏళ్లు తమకు దూరంగా ప్రభుత్వం చేతిలో ఉంది. మళ్లీ ఇన్నాళ్లకు పూర్తిగా టాటాల అధీనంలోకి వెళ్లింది. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ చేతికి అప్పగించింది కేంద్రం.
దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియను గురువారం పూర్తి చేసింది. ఎయిర్ఇండియాలోని 100శాతం వాటాను టాటా గ్రూప్‌కు చెందిన లాటెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేసింది. దీంతో శుక్రవారం నుంచి ఎయిరిండియా నిర్వహణ, నియంత్రణ పూర్తిగా టాటా గ్రూప్ చేతిలోనే ఉండనుంది.