Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముగ్గురు డాక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన "ది రాంగ్ స్వైప్"

ముగ్గురు డాక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన
విజ‌య‌వాడ‌ , సోమవారం, 6 డిశెంబరు 2021 (11:12 IST)
అమ్మా నాన్న ఇద్దరూ పేరొందిన డాక్టర్స్. తను కూడా చిన్న వయసులోనే పెద్ద పేరు సంపాదించు కుంటున్న డాక్టర్. సాఫీగా సాగిపోతున్న గొప్ప జీవితం. కానీ ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి, వేలాది మంది కాదు - కొట్లాది మందిలో ఏ కొంతయినా మార్పు తీసుకురావాలనే తపనతో సినీ రంగ ప్రవేశం చేసి, తొలి చిత్రం "ది రాంగ్ స్వైప్"తో తన సత్తాను ఘనంగా చాటుకున్న ఆ డాక్టర్ టర్నడ్ డైరెక్టర్ పేరు రవి కిరణ్ గాడాల. 
 
 
తన తోటి డాక్టర్ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో మొబైల్ ఫోన్ (ఒన్ ప్లస్ 6 టి) ను కెమెరాగా చేసుకుని, చాలా పరిమిత బడ్జెట్ తో వీకెండ్ లో మాత్రమే షూట్ చేసి చిత్రం "ది రాంగ్ స్వైప్ష‌. ఈ చిత్రాన్ని అద్వితీయంగా తెరకెక్కించిన యువ ప్రతిభా కిరణం డాక్టర్ రవికిరణ్ కు డైరెక్టర్ గా అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే, తను మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ, మరో వినూత్నమైన సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు డాక్టర్ రవికిరణ్.
 
 
"ది రాంగ్ స్వైప్" చిత్రం ద్వారా ముగ్గురు డాక్టర్లు ఇండస్ట్రీకి పరిచయమవ్వడం విశేషం. ఈ చిత్ర నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి, హీరో డాక్టర్ ఉదయ్ రెడ్డి, డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి. ఈ ముగ్గురూ ఈ చిత్రం సాధిస్తున్న సక్సెస్ ఇస్తున్న ఉత్తేజంతో టాలీవుడ్ లో లాంగ్ ఇన్నింగ్స్ ప్లే చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా లబ్ధ ప్రతిష్టులైన పలువురు చిత్ర ప్రముఖులు "ది రాంగ్ స్వైప్" చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం, ఈ రంగంలో తాము కూడా రాణించగలమనే నమ్మకాన్ని రెట్టింపు చేసిందని డాక్టర్ రవికిరణ్ అంటున్నారు. 
 
 
సుప్రసిద్ధ దర్శకులు కోదండరామిరెడ్డి, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సోనీ లివ్ హెడ్ మధుర శ్రీధర్ రెడ్డి, ఊర్వశి సారథులు రవి కనగాల- తుమ్మలపల్లి రామసత్యనారాయణ "ది రాంగ్ స్వైప్" చిత్రాన్ని ఇటీవల కాలంలో తాము చూసిన చాలా మంచి చిత్రాల్లో ఒకటని కొనియాడారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకపోవడం "ది రాంగ్ స్వైప్" ప్రత్యేకత అని వారు పేర్కొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని డాక్టర్ రవికిరణ్ తెలిపారు.
 
 
చక్కెర వ్యాధిని నయం చేయడంలో సిద్ధహస్తుడైన డాక్టర్ రవికిరణ్, "6 ఎమ్.పి" పేరుతో తన తదుపరి చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. షుగర్ వ్యాధి బారి నుంచి తన పరిధిలో వేలాది మందిని కాపాడుతూనే, కొట్లాది మందికి వినోద వైద్యం అందించాలని తహతహలాడుతున్నడాక్టర్ రవికిరణ్ కు బెస్ట్ ఆఫ్ ల‌క్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగాలాండ్ పౌరులపై ఉద్దేశ్వపూర్వకంగా కాల్పులు!!