Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబరు నుంచి మారనున్న ఆటో డెబిట్ రూల్స్.. ఏంటవి?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (22:20 IST)
చాలామంది బ్యాంకు ఖాతాదారులు విద్యుత్‌, వాట‌ర్‌, గ్యాస్ బిల్లుల‌తోపాటు నెల‌వారీ రుణ వాయిదాలు, బీమా ప్రీమియంలు, మొబైల్ రీచార్జి, ఇంట‌ర్నెట్ స‌ర్వీసెస్ త‌దిత‌ర సేవ‌ల‌ చార్జీల‌పేమెంట్స్‌ను ఆటో డెబిట్ విధానంలో చెల్లిస్తుంటారు. ఈ ఆటో డెబిట్ నిబంధనలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మారనున్నాయి. ఖాతాదారుల భద్రత, పేమెంట్స్ సజావుగా సాగేందుకు వీలుగా భారతీయ రిజర్వు బ్యాంకు ఈ కొత్త తరహా విధానానికి శ్రీకారం చుట్టింది. 
 
కానీ అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి ఈ లావాదేవీల‌ను జ‌రుప‌డానికి ఖాతాదారుల నుంచి అడిష‌న‌ల్ ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్ (ఏఎఫ్ఏ) అంటే ధ్రువీక‌ర‌ణ పొందాల‌ని ఆర్బీఐ గతంలోనే ప్రకటించింది. అయితే, ఈ కొత్త నిబంధన మేరకు రూ.5000 దాటిన ప్ర‌తి పేమెంట్‌కు వ‌న్‌టైం పాస్‌వ‌ర్డ్ (ఓటీపీ) త‌ప్ప‌నిస‌రి చేసింది.
 
తొలుత ఈ నిబంధ‌న‌ను 2019 డిసెంబ‌ర్ 31 నుంచి అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించినప్పటికీ ఇండియ‌న్ బ్యాంక్స్ అసోసియేష‌న్ అభ్య‌ర్థ‌న మేర‌కు గ‌డువును పొడిగించింది. దీని ప్ర‌కారం గ‌త ఏప్రిల్ నుంచి అమ‌లులోకి రావాల్సి ఉంది. అప్పటికి కూడా చాలా బ్యాంకులు తమ బ్యాంకింగ్ ఆన్‌లైన్ వ్యవస్థను మెరుగుపరుచుకోలేదు. దీంతో గడువు పెంచాలని కోరడంతో ఈ నెలాఖరు వరకు పొడగించారు. దీంతో కొత్త విధానం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. ఈ విధానాన్ని పాటించని బ్యాంకులపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆర్బీఐ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments