Webdunia - Bharat's app for daily news and videos

Install App

చందనంలో కాస్త పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే?

ఈ కాలంలో ముఖచర్మం పొడిబారడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇటువంటి సమస్యల వలన రకరకాల క్రీములను వాడుతుంటారు. అవి చర్మం రంగును కోల్పోయేలా చేస్తాయి. అందువలన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యలను తొలగ

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (14:31 IST)
ఈ కాలంలో ముఖచర్మం పొడిబారడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇటువంటి సమస్యల వలన రకరకాల క్రీములను వాడుతుంటారు. అవి చర్మం రంగును కోల్పోయేలా చేస్తాయి. అందువలన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యలను తొలగించుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
బంగాళాదుంపలను ఉడకబెట్టుకున్న తరువాత వాటిని ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. కాసేపయ్యాక వాటిని తీసుకుని బాగా నలిపి ముఖానికి రాసుకోవాలి. దీంతో ముఖంలో నల్లటి వలయాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. నారింజ పండు తొక్కను ముఖంపై రుద్దుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
పసుపు, చందనములను పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. పచ్చిపాలను దూదిలో ముంచి ముఖానికి మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుంది. వంటసోడాలో కొద్దిగా నీటిని కలుపుకుని ముఖానికి రాసుకుంటే నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
కీరదోసకాయను మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. కొబ్బరినూనె, కర్పూరాన్ని మిశ్రమంగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వలన కోమలమైన చర్మాన్ని పొందవచ్చును. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments