Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలకూరతో పిజ్జా ఎలా చేయాలో చూద్దాం....

ఆకుకూరల్లో ప్రధానం పాలకూర. పాలకూరలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్‌ ఎ, సి, పీచుపదార్థం‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నిషియం, క్యాల్షియం పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా పాలకూరలో యాంటీఆక్సిడెంట్‌ అధికంగా ఉంటాయి. మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూర అనే

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (13:43 IST)
ఆకుకూరల్లో ప్రధానం పాలకూర. పాలకూరలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్‌ ఎ, సి, పీచుపదార్థం‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నిషియం, క్యాల్షియం పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా పాలకూరలో యాంటీఆక్సిడెంట్‌ అధికంగా ఉంటాయి. మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూర అనేక పోషకాలను అందిస్తుంది. తద్వారా మతిమరుపు వ్యాధి నుండి విముక్తి చెందవచ్చును. అటువంటి పాలకూరతో పిజ్జా ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
బ్రెడ్‌ స్లైస్స్ - 2 
పాలకూర - 1 కట్ట 
స్వీట్‌కార్న్‌- అరకప్పు (ఉడికించినవి)
చీజ్‌ తురుము - అరకప్పు 
వెల్లుల్లి రెబ్బలు - 4 
వెన్న - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత  
 
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్స్ వెన్న వేసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక తరిగిన వెల్లుల్లి, కడిగిన పాలకూర వేయాలి. కాసేపటి తరువాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు చల్లాలి. పాలకూర బాగా ఉడికాక స్వీట్‌కార్న్‌ వేసి కలపాలి. ఇది కూరలా తయారయ్యాక దింపేయాలి. ఇప్పుడు బ్రెడ్‌ ముక్కలకు మిగిలిన వెన్న రాసి దోరగా కాల్చి తీసుకోవాలి. వాటిమీద ఉడికించిన పాలకూర మిశ్రమం, చీజ్‌ తురుము పరిచి మళ్లీ పెనంపై పెట్టాలి. చీజ్‌ కరిగిన తరువాత ఆ బ్రెడ్ ముక్కను తీసేయాలి. అంతే పాలకూర పిజ్జా రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments