బేబీ పొటాటో ఫ్రై తయారీ విధానం...
బంగాళాదుంపల్లో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. బంగాళా దుంపలు ఎక్కువ క్యాలరీలను ఒక్కసారిగా అందిస్తాయి. కాబట్టి మోతాదుకు మించకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బంగళాదుంపల్లో పీచు పుష్
బంగాళాదుంపల్లో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. బంగాళా దుంపలు ఎక్కువ క్యాలరీలను ఒక్కసారిగా అందిస్తాయి. కాబట్టి మోతాదుకు మించకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బంగళాదుంపల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి పొటాటోతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
బేబీ పొటాటోస్ - 12
నూనె - సరిపడా
ఎండు మిర్చి - 1
జీలకర్ర - 1 స్పూన్
కరివేపాకు - 4 రెబ్బలు
ధనియాల పొడి - 1 స్పూన్
పసుపు - 1/2 స్పూన్
జీరా పొడి, కారం, గరం మసాల, ఆమ్‌చూర్ పొడి - 1 స్పున్స్
ఉప్పు - రుచికి తగినంత
నిమ్మరసం - స్పూన్స్
కొత్తిమీర తరుగు - పావు కప్పు
తయారీ విధానం:
ముందుగా బేబీ పొటాటోలను ఉడికించి చల్లారిన తరువాత తొక్క తీసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను వేసి ఎండు మిర్చి, కరివేపాకు, జీలకర్ర వేగించాలి. ధనియాలపొడి, కారం, జీరాపొడి, గరం మసాల, ఆమ్‌చూర్, పసుపు, ఉప్పు వేసి చిన్నమంటపై మాడకుండా వేగించాలి. తరువాత బేబీ పొటాటోలను వేసి చిదిగిపోకుండా కలిపి 7 నిమిషాల పాటు అలానే ఉంచాలి. చివరగా నిమ్మరసాన్ని కలుపుకుని కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడివేడి బేబీ పొటాటో ఫ్రై రెడీ.