Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటీమణికి మత్తు ఇచ్చి అసభ్యకర వీడియో... అది ఇవ్వకుంటే చూపిస్తానంటూ బెదిరింపు

సినీ ఇండస్ట్రీలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇది కన్నడ చిత్ర పరిశ్రమలో జరిగింది. జల్సాల కోసం అలవాటుపడ్డ కన్నడ స్టార్ నటుడు ధర్మేంద్ర, మరో నటి సునీతపై కన్నేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మార్చి 1, 2017న రాత్రి సునీతకు ధర్మేంద్ర షూటింగ్

Advertiesment
Sandalwood
, బుధవారం, 1 ఆగస్టు 2018 (10:52 IST)
సినీ ఇండస్ట్రీలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇది కన్నడ చిత్ర పరిశ్రమలో జరిగింది. జల్సాల కోసం అలవాటుపడ్డ కన్నడ స్టార్ నటుడు ధర్మేంద్ర, మరో నటి సునీతపై కన్నేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మార్చి 1, 2017న రాత్రి సునీతకు ధర్మేంద్ర షూటింగ్ వున్నదంటూ చెప్పాడు. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌కు రావాలన్నాడు.


ఐతే ఆమె అక్కడికి వెళ్లగా షూటింగ్ ఆనవాళ్లేమీ లేవు. ఆమె కోసం కాచుకుని కూర్చున్న ధర్మేంద్ర... షూటింగ్ రద్దయ్యింది... భోజనం చేసి వెళ్దువు రమ్మంటూ ఆమెను తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెకు కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది తాగిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. 
 
అలా ఆమె మత్తులోకి జారుకోగానే అసభ్యకర రీతిలో ఆమెను వీడియో తీశాడు. కొన్ని గంటల తర్వాత మత్తు వదిలి మామూలు స్థితికి సునీత వచ్చింది. ఆ వెంటనే అసభ్యకర వీడియో చూపించి... తనకు డబ్బులిస్తే సరే అనీ లేదంటే ఈ వీడియోను లీక్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దీనితో ఆమెకు ఏం చేయాలో తోచక అతడు అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చింది. ఇప్పటివరకూ సుమారు రూ. 14 లక్షలు సమర్పించుకుంది. ఇంకా అతడు వేధిస్తుండటంతో వల్లగాక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలి చూపులోనే ప్రేమించుకున్నాం.. వారం క్రితం పారిపోయాం.. ఈ ఫోటో ఎలా లీకైందో?