పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి...?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:17 IST)
మనం చేసుకునే సౌందర్య చిట్కాలన్నీ దాదాపుగా చర్మానికి నునుపు, తెలుపు తెచ్చేవే. తెల్లగా రావాలని ప్రతి ఒక్కరూ ఆశించడంలో తప్పులేదు. వున్న రంగు కంటే కాస్త ఎక్కువ రంగు మెరుగుపడాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇందుకోసం బ్యూటీపార్లర్‌లకు వెళ్లే తీరిక లేకుంటే ఇంట్లోనే అంతకంటే మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ ట్రీట్‌మెంట్లు.
 
4 బాదం పప్పులను నానబెట్టి పాలు కలుపుతూ మెత్తగా గ్రెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వరుసగా పదిహేను రోజులు చేస్తే ఫలితం ఉంటుంది.
 
ఒక స్పూన్ పెసర పిండికి రెండు స్పూన్ల పాలు, రెండు మూడు చుక్కల నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. క్రమం తప్పకుండా నాలుగు వారాల పాటు చేయాలి.
 
పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌ను చర్మానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా పదిహేను రోజులు చేయాలి. ఒక టమోటాను గ్రైండ్ చేసి 3 చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా ఇరవై రోజులపాటు ఉదయం, సాయంత్రం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : విచారణకు సహకరించాలని చెప్పా : శ్రీచరణ్ తండ్రి

హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త

జూలై నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు

వాష్ రూమ్‌లో ప్రసవించి వెంటిలేటర్ రంధ్రం నుంచి నవజాత శిశువును విసిరేసిన యువతి

బికారి అయిన వ్యక్తి మోజులో పడి కోటీశ్వరుడైన కాబోయే భర్తను హత్య చేసిన యువతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

రాం చరణ్‌కు జాతీయ అవార్డు రాకూడదు : మెగాస్టార్ చిరంజీవి

జంగా నుంచి పోలీస్ ఆపీసర్ గా గగన్ బాబు స్పెషల్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments