ఆ శక్తి పెరగాలంటే.. పుచ్చకాయ తినాల్సిందే..?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (09:50 IST)
పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్స్, ప్రోటీన్స్ అందించడంలో పుచ్చకాయ ఎంతగానో దోహదపడుతుంది. దీనిని తరచు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పుచ్చకాయ అంటే నచ్చని వారుండరు. పనిపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అధిక బరువును తగ్గించాలంటే.. రోజుకో గ్లాస్ పుచ్చకాయ జ్యూస్ తాగితే సరిపోతుంది.
 
పుచ్చకాయను తినడం వలన రక్తనాళాలు గట్టి పడి, బిగుసుకుపోకుండా కూడా కాపాడుతుంది. మెదడును శక్తివంతంగా మార్చడం, మతిమరుపును కలిగించే అల్జీమర్ వ్యాధిని నిరోధించడంలో పుచ్చకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చకాయలోని నిట్రులిన్ పురుషుల్లో లైంగిక శక్తిని పెంచుతుంది. అలానే వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలను కూడా నివారిస్తుంది.
 
అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులోని మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతాయి. పుచ్చకాయలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో తిరుగాడే హానికారక ఫ్రీర్యాడికల్స్‌ను అణచివేయడం ద్వారా ఆరోగ్యానికి మేలుచేస్తాయి. పుచ్చకాయ ఈ వేసవి కాలంలో శరీరానికి కావలసిన నీటిని అందిస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కేశ సంరక్షణలో బాగా తోడ్పడుతుంది. 
 
అజీర్తితో బాధపడేవారు తరచు పుచ్చకాయ తింటుంటే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండడం వలన వేసవిలో ఇది శరీరానికి కావలసిన చల్లదనాన్ని అందిస్తుంది. ముఖ్యంగా దాహాన్ని తగ్గిస్తుంది. ఇందులోని బీటా కెరిటోన్స్ శ్వాసకోశాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దాంతోపాటు శరీర రోగనిరోధకశక్తిని కూడా పెంచుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

తర్వాతి కథనం