Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంటసోడాను ఉప్పుతో చేర్చి.. ఇలా చేస్తే..?

వంటసోడాను ఉప్పుతో చేర్చి.. ఇలా చేస్తే..?
, బుధవారం, 3 ఏప్రియల్ 2019 (11:03 IST)
చాలామందికి దంతాలు గారపట్టి ఉంటాయి. అలా ఉన్నప్పుడు చూడడానికి ఇబ్బందికరంగా కనిపిస్తాయి. దంతాలపై గార ఉండడం వలన నలుగురిలో నవ్వలేం. ఈ గారను తొలగించడానికి చాలామంది డాక్టర్లను సంప్రదిస్తారు. కానీ, ఇలా చేయడం వలన ఎలాంటి ఫలితాలు కనిపించవని చెప్తున్నారు. అయితే ఇంటి వద్దే దంతాలపై ఉన్న మరకలను తొలగించవచ్చును. మరి అదేలాగో చూద్దాం..
 
స్పూన్ వంటసోడాను అరస్పూన్ ఉప్పుతో కలుపుకోవాలి. ఆపై టూత్‌బ్రష్‌ను తడిగా చేసి ఈ మిశ్రమంలో ముంచాలి. తర్వాత ఆ బ్రష్‌తో 5 నిమిషాలపాటు దంతాలపై రుద్దుకోవాలి. వెంటనే ఓ కప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుని అరకప్పు వెచ్చని నీటిలో కలిపి బాగా పుక్కిలించాలి. తర్వాత అరకప్పు చల్లని నీటితో పుక్కిలించాలి. ఇక డెంటల్ పిక్ తీసుకుని దంతాలపై పసుపు మరకలు ఉన్న చోట జాగ్రత్తగా రుద్దుకోవాలి. ఇలా చేశాక యాంటీ సెప్టిక్ మౌత్ వాష్‌తో నోరు కడుక్కోవాలి. రెండు రోజులకోసారి ఇలా చేయడం వలన పంటి గార తగ్గుతుంది.
 
దంతాలకు విటమిన్ సి చాలా అవసరం. ఈ విటమిన్ సి నిమ్మ, నారింజ వంటి వాటిల్లో లభిస్తుంది. ఈ పండ్లను తీసుకుని రోజూ ఓ 5 నిమిషాల పాటు దంతాలపై రుద్దడం వలన కూడా గార పోతుంది. ఆ పండ్లను రుద్దిన తర్వాత వంటసోడాతో పుక్కిలిస్తే సరిపోతుంది. తద్వారా నోరు సహజంగానే శుభ్రమవుతుంది. రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందు నారింజ తొక్కతో దంతాలపై రుద్దడం వలన నోట్లోని బ్యాక్టీరియాలు నశిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయాణాలలో వాంతులా.. అయితే ఇలా చేయండి..?