Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లవంగ నూనెలో దూదిని ముంచి...?

లవంగ నూనెలో దూదిని ముంచి...?
, మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:48 IST)
లవంగాల్లోని యుజెనాల్ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది. పంటి నొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగాన్ని బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకోవడం వలన నోటి దుర్వాసన పోవడమే కాకుండా శ్వాసని తాజాగా ఉంచుతుంది.
 
రెండు లవంగాల్ని బుగ్గన పెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక కలగదు. లవంగాలను నీళ్లలో మరిగించి తాగడం వలన అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.
 
లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది. పెద్ద పేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మ జీవుల్నీ లవంగంలోని 'యుజెనాల్' నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందుగా ఉపయోగపడుతుంది. రెండుమూడు లవంగాలకు కొద్దిగా పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది.
 
జలుబుతో బాధ పడేవాళ్లు కర్ఛీఫ్‌మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే వెంటనే తగ్గిపోతుంది. ఏడు మొగ్గల్ని కొద్దినీళ్లలో మరిగించి దాని నుంచి వచ్చే ఆవిరిని పీల్చి చల్లారిన తరువాత ఆ నీటిని తాగేస్తే జలుబుతో మండిపోతున్న ముక్కుకి హాయిగా ఉంటుంది. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవడడంతో పాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్, ఆర్థ్రైటిస్, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుదీనా ఆకులను నమలడం.. రసాన్ని తాగితే..?