హార్దిక్ పాండ్యా, రాహుల్‌కి నోటీసులు.. ఎందుకంటే.?

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:14 IST)
భారత క్రికెటర్‌లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ ఓ ప్రైవేట్ టెలివిజన్ టాక్‌షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్ వారికి నోటీసులు జారీ చేసారు. 
 
వారిద్దరు వ్యక్తిగతంగా తన ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది. నిబంధనల ప్రకారం రాహుల్, హార్దిక్ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. వారిద్దరి అభిప్రాయాలు వినడం న్యాయం. ఎప్పుడు వస్తారన్నది వాళ్ల ఇష్టం అని అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్ అన్నారు.
 
ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న వీరిద్దరు ముంబై, పంజాబ్ మధ్య జరిగే సమయంలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ జైన్‌కు హార్దిక్, రాహుల్ వ్యవహారంతో పాటు గంగూలీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కూడా ముందు ఉన్నటు తెలుస్తున్నది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సన్నీ లియోన్‌తో విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ముంబై ఎయిర్ పోర్టులో ఎలా?