ముఖం ఎంత అందంగా కనిపిస్తుందో అదేవిధంగా దంతాలు అందంగా కనిపించాలి. కానీ, కొందరికి అది సాధ్యం కాదు. అలాంటివారి కోసం.. దంతాలు మెరిసేలా చేసే చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిని అనుసరిస్తే మల్లెపువ్వుల్లా పళ్లు మిలమిలా మెరిపోతాయి. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం..
1. ఆలివ్ ఆయిల్, ఆపిల్ సైడర్ వెనిగర్ ఈ రెండింటినీ సమపాళ్లల్లో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో టూత్‌బ్రష్‌ను కాసేపు ఉంచాలి. ఆ తరువాత దాంతో దంతాలు తోముకుంటే ఫలితం కనిపిస్తుంది.
2. భోజనం చేసిన తరువాత నీటితో నోటిని పుక్కిలిస్తే దంతాలపై మచ్చలు పడవు. మెరుపు తగ్గదు. అలానే తులసి ఆకులు, కమలాపండు తొక్కలతో దంతాలు తోముకుంటే తళతళ మెరుస్తాయి.
3. అరటిపండు తొక్కలో ఉండే సన్నని పొరలతో దంతాలు 2 నిమిషాలు రుద్దుకుంటే మంచిది. ఈ తొక్కలోని పొటాషియం, మెగ్నిషియ, మాంగసీస్ వంటి ఖనిజాలు దంతాల్లోని ఇంకడం వలన వాటికి మెరుపు వస్తుంది.
4. అరస్పూన్ బేకిండ్ సోడాను నిమ్మరసంలో వేసి బాగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌తో దంతాలపై రుద్దుకుంటే దంతాలు మెరుపులు చిందిస్తాయి. దాంతోపాటు నోట్లోని చెడు బ్యాక్టీరియాలు కూడా పోతాయి.