Webdunia - Bharat's app for daily news and videos

Install App

ISWOTY: టోక్యో ఒలింపిక్ క్రీడలపై జెయింట్ కిల్లర్ సోనమ్ మాలిక్ ఆశలు

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (18:11 IST)
సోనమ్ మాలిక్. ఇప్పటివరకూ ఈమె ఒక్క ఒలింపిక్ పతకం కూడా గెలిచుండకపోవచ్చు. కానీ, ఒక ఈ యువ రెజ్లర్ ఒలింపిక్ పతక విజేతను ఒక్కసారి కాదు, రెండు సార్లు ఓడించింది. సోనమ్ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనలేదు. కానీ, ఒలింపిక్ కాంస్య పతక విజేత, తన దేశానికే చెందిన సాక్షి మాలిక్‌తో జరిగిన బౌట్స్‌లో ఇప్పటికే విజయం సాధించింది.

 
క్రీడాకారులు సాధారణంగా సుదూర ప్రాంతాల్లోని క్రీడా దిగ్గజాలను ఆరాధిస్తుంటారు. కానీ, రెజ్లర్ సోనమ్ మాలిక్‌కు ప్రేరణ కోసం అంతంత దూరం చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. ఈ హర్యానా అమ్మాయి బాల్యం నుంచే తన చుట్టూ ఉన్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్స్‌ను చూస్తూ పెరిగింది. సోనమ్ మలిక్ 2002 ఏప్రిల్ 15న హర్యానా, సోనిపట్ జిల్లాలోని మదీనా గ్రామంలో పుట్టింది. ఒక రెజ్లర్ ఎలా ప్రవర్తించాలి, మంచి క్రీడాకారుడు కావాలంటే మంచి అలవాట్లు ఎలా పెంచుకోవాలి అనే విషయాలతోపాటూ క్రీడల గురించి జరిగే చర్చలు వింటూనే పెరిగింది. దాంతో, ఆమెలో చిన్నతనం నుంచే ఒలింపిక్ పతకం గెలవాలనే కోరిక పెరుగుతూవచ్చింది.

 
చిన్ననాటి కలను పెంచి పోషించింది
తండ్రితోపాటూ కుటుంబంలో చాలా మంది కజిన్స్ కుస్తీలో ఉండడంతో తన గమ్యం ఏంటి అనే విషయంలో ఆమెకు బహుశా ఆప్పటికే ఒక స్పష్టత వచ్చింది. అందుకే, సోనమ్ చిన్నతనం నుంచే కుస్తీని ఇష్టపడింది. తండ్రి స్నేహితుల్లో ఒకరు గ్రామంలో రెజ్లింగ్ అకాడమీ ప్రారంభించడంతో మలిక్ తన తండ్రితో కలిసి అక్కడకు వెళ్లడం మొదలు పెట్టింది.

 
మొదట్లో ఆ అకాడమీలో రెజ్లింగ్ మ్యాట్ కూడా ఉండేది కాదు. అలా సోనమ్ నేలమీదే శిక్షణ పొందింది. కానీ, వర్షాకాలంలో ఆ గ్రౌండ్ కూడా బురద అయిపోయేది. దాంతో, శిక్షణ తీసుకునేవారు తమ శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోడానికి రోడ్ల మీదే కుస్తీ ప్రాక్టీస్ చేసేవారు. అన్ని మౌలిక సదుపాయాల కొరత ఉన్నప్పటికీ, ఆకాడమీ ఆమెకు చాలా విలువైన ప్రారంభ శిక్షణను అందించింది. కుటుంబం కూడా ఆమె వెంట బలంగా నిలిచింది. నాలుగేళ్లకోసారి జరిగే 2016 నేషనల్ గేమ్స్‌లో సోనమ్ మలిక్ స్వర్ణ పతకం గెలిచింది. అది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.

 
ఆ విజయం ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. మరింత బాగా ప్రాక్టీస్ చేస్తే, మరిన్ని పతకాలు గెలవచ్చని సోనమ్‌కు తెలిసుకునేలా చేసింది. మాలిక్ తన సత్తా ఏంటో నిరూపించుకున్న సంవత్సరం 2017. ఆ ఏడాది ఆమె వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించడంతోపాటూ, అవుట్‌స్టాండింగ్ పెర్ఫామెన్స్ అవార్డు కూడా గెలుచుకుంది. ఆ విజయం ఆమెకు ఉజ్వల భవిష్యత్తును కూడా అందించింది. సోనమ్ తనకు స్పాన్సర్‌షిప్‌ను సంపాదించడమే కాదు, ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం కూడా పొందింది. భారత కుస్తీ అనగానే గుర్తుకు వచ్చే హర్యానాకు చెందిన ఎంతోమంది ప్రముఖ రెజ్లర్లోపాటూ సోనమ్ మలిక్ పేరు కూడా మారుమోగింది.

 
గాయాల నుంచి పుంజుకుంది
మ్యాట్ మీద రాణిస్తున్న సమయంలో 2017లో మాలిక్‌కు అయిన ఒక గాయం దాదాపు ఆమె కెరీర్‌కే ముప్పు తెచ్చింది. ఏథెన్స్ వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత కొంత కాలానికే ఒక రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలో పాల్గొన్న సోనమ్ మలిక్ గాయపడింది. ఆమె నరాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు. ఏడాదిన్నర పాటు ఆమెకు చికిత్స కొనసాగింది. కోలుకోడానికి చాలాకాలం పట్టింది. అలాంటి గాయాలతో వర్ధమాన క్రీడాకారుల క్రీడా జీవితమే ముగిసిపోయే ప్రమాదం ఉంటుంది.

 
ఆ గాయం, ఫలితంగా వచ్చిన బ్రేక్ ఆమె బలానికి, అభిరుచికి, పట్టుదలకు పరీక్షగా నిలిచాయి. చివరకు ఆ కష్టం నుంచి గట్టెక్కిన సోనమ్ మరింత బలం పుంజుకుంది. తిరిగి శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. 2020 జనవరి, ఫిబ్రవరిలో రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ను 62 కిలోల విభాగంలో ఓడించినపుడు సోనమ్ మాలిక్ పట్టులో ఎంత బలముందో అందరికీ తెలిసింది. సోనమ్ రెండోసారి విజయం సాధించగానే, టోక్యో ఒలింపిక్ క్వాలిఫయర్లలో పాల్గొనడానికి అర్హత కూడా సాధించింది.

 
ఒలింపిక్ క్రీడలకు క్వాలిఫై కావడమే కాదు, ఆ క్రీడల్లో పతకంతో తిరిగి రావాలని సోనమ్ ఇప్పుడు ఆశగా ఎదురుచూస్తోంది.నిరంతరం తనకు అండగా నిలిచిన తండ్రి, మిగతా కుటుంబ సభ్యుల్లాగే, అన్ని కుటుంబాలు తమ కూతుళ్లు వారి లక్ష్యాన్ని అందుకోడానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ యువ క్రీడాకారిణి చెబుతోంది.
 
(ఈ కథనానికి బీబీసీ మెయిల్ ద్వారా పంపిన ప్రశ్నావళికి సోనమ్ మలిక్ ఇచ్చిన సమాధానాలు ఆధారం)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments