Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైనోసార్స్: పెట్రోల్, డీజిల్‌లు ఈ జంతువుల వల్లే పుట్టుకొచ్చాయా?

Webdunia
మంగళవారం, 23 మే 2023 (13:29 IST)
రోజూ మనం వాడే పెట్రోలు, డీజిల్, ఇంకా పలు ఫ్యుయల్ సంబంధిత ఉత్పత్తులకు మూలం చమురు. ఇది నేటి సమాజానికి ఒక ఇంజిన్‌లాంటిది. అనేక యుద్ధాలకు, వాతావరణ మార్పులకు బాధ్యత వహించేది కూడా ఈ చమురే. ప్రపంచంలో ప్రతిరోజూ 80 మిలియన్ బ్యారెల్స్ కంటే ఎక్కువ చమురు ఉత్పత్తి అవుతుంది. "స్టోన్ ఆయిల్" అని పిలిచే దీని పేరు లాటిన్ నుంచి వచ్చింది. "నల్ల బంగారం" అని పిలిచే ఈ జిగట ద్రవం హైడ్రోకార్బన్‌ల మిశ్రమం. వాటి పరమాణు నిర్మాణంలో ప్రధానంగా కార్బన్, హైడ్రోజన్‌ల సమ్మేళనం ఉంటుంది. లక్షల సంవత్సరాల పాటు భూమిలో జరిగిన అనేక పరివర్తన ప్రక్రియల వల్ల తయారైన ప్రోడక్ట్ ఇది.
 
చమురు ఎక్కడ నుంచి వస్తుంది?
చమురు పుట్టుకకు మూలమేంటో తమకు తెలుసని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే, దాని చుట్టూ అనేక అపోహలు కూడా ఉన్నాయి. నేటి ముడి చమురు నిక్షేపాలలో 70 శాతం వరకు మెసోజోయిక్ యుగంలో ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ యుగం 252 నుంచి 66 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు కొనసాగింది. మెసోజోయిక్‌ను ట్రయాసిక్, జురాసిక్, క్రెటేషియస్ కాలాలుగా విభజించారు. మెసోజోయిక్‌ను సరీసృపాల యుగం అని కూడా పిలుస్తారు. ఆ సమయంలో డైనోసార్‌లు మంచి స్థితిలో ఉన్నాయి. "కొన్ని విచిత్ర కారణాలతో డైనోసార్ల నుంచి చమురు వస్తుందనే వాదన చాలా మందిలో ఉంది. కానీ, చమురు ఆల్గే, పాచిల నుంచి వస్తుంది" అని ఓస్లో విశ్వవిద్యాలయంలో భూగర్భశాస్త్ర ప్రొఫెసర్ రీడర్ ముల్లర్ అంటారు.
 
నిపుణులు ఏమంటున్నారు?
డైనోసార్ల నుంచి వచ్చిందనే వాదన ఎలా పుట్టిందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. లాటిన్ అమెరికాలో కూడా ఇది వ్యాపించింది. మెక్సికోకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్‌లు డారియో సోలానో, ఇజా కెనాల్స్‌లను ఈ నమ్మకం గురించి బీబీసీ ప్రశ్నించింది. "అవును, ఇది అపోహ" అని వాళ్లు అన్నారు. డారియో సోలానో, ఇజా కెనాల్స్‌లు నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలో ఎర్త్ సైన్సెస్ విభాగంలోని ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్‌లు. "హైడ్రోకార్బన్‌లను ఉత్పత్తి చేసే అనేక రాళ్లు జురాసిక్ ఏజ్‌లో ఉన్నాయని కనీసం మా కమ్యూనిటీలో మేం గుర్తించగలం. ఇది భౌగోళిక కాలానికి సంబంధించినది. ఇది తరచుగా డైనోసార్‌లతో ముడిపడి ఉంటుంది. బహుశా ఆ ఆలోచనను బలోపేతం చేయడానికి ఇదే కారణం అయ్యుంటుంది" అని సోలానో చెప్పారు. "ఈ అపోహలను తిరస్కరించడం చాలా ముఖ్యం. మొదటగా సాధారణ, విస్తృత ఉపయోగంలో ఉన్న ఒక పదార్థానికి సంబంధించిన అజ్ఞానాన్ని తొలగించాలి. రెండోది ఈ వనరు మూలాన్ని అర్థం చేసుకోవడంలో ముందుకు సాగాలి. అప్పుడే కొత్త సాంకేతికతలు లేదా అభివృద్ధిలో ముందుకు సాగడం సాధ్యమవుతుంది" అని కెనాల్స్ అన్నారు.
 
ఆయిల్ ఎలా ఏర్పడుతుంది?
''ఆయిల్ పుట్టుక కథలో ప్రధాన పాత్రలు పెద్ద సరీసృపాలు కాదు, చిన్నజీవులే. సముద్రాలు, మడుగుల దిగువన పేరుకుపోయిన జంతువుల అవశేషాలు, మైక్రోఆల్గేలు కుళ్లిపోవడం ద్వారా ఈ వనరు ఉద్భవించింది. ఈ సిద్ధాంతం సూక్ష్మ అవక్షేపాలు, సేంద్రీయ అవశేషాలు ముఖ్యంగా భూ సంబంధమైన లేదా సముద్రపు మొక్కలలో నిక్షిప్తం అవుతాయని సూచిస్తుంది. కొన్ని ప్రక్రియల తర్వాత కెరోజెన్ ఏర్పడుతుంది. ఇది ఈ సేంద్రీయ పదార్థాల మిశ్రమం. చాలాకాలం తర్వాత ఒత్తిడి, ఉష్ణోగ్రత పెరుగుతాయి, చివరకు హైడ్రోకార్బన్ గొలుసులు ఏర్పడతాయి'' అని ఇరువురు శాస్త్రవేత్తలు వివరించారు.
 
ఆయిల్ లో శక్తి ఎక్కడ నుంచి వస్తుంది?
పురాతన అడవుల సేంద్రీయ పదార్ధాల రూపాంతరం నుంచి కూడా చమురు రావచ్చు. ఆర్గానిక్ థియరీలో ఏ రకమైన ఆర్గానిక్ మెటీరియల్ అయినా ఉండవచ్చని అర్థం అవుతుంది. వాస్తవానికి భూ సంబంధమైన కూరగాయలతో కూడిన కెరోజెన్ల నుంచి లభించే హైడ్రోకార్బన్ రకం గ్యాస్ నిక్షేపాలతో ముడిపడి ఉందని మెక్సికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చమురు సౌరశక్తిలోని శక్తి వృక్ష జీవులు ద్వారా కిరణజన్య సంయోగక్రియలో సంగ్రహణకు గురై, జంతు జీవులకు బదిలీ అయిందా?. 
 
"లేదు, ఇది ఒక అపోహ" అని కెనాల్స్ అంటున్నారు. "ఈ రోజు మనం చమురు నుంచి పొందే శక్తి హైడ్రోజన్, కార్బన్ గొలుసుల ఆక్సీకరణ (దహన) ద్వారా పొందుతాం" అని అన్నారు కెనాల్స్. "శక్తి , పదార్థం పరస్పరం మార్చుకోగలవు అనేది నిజం. అవి ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్ సౌర బ్యాటరీల మాదిరి ఉంటాయి. మానవులు అనేక పదార్థాలను ఎలా తినగలరో, శరీరం మన జీర్ణవ్యవస్థలో మరొక ఆక్సీకరణ ప్రక్రియ (జీర్ణం) ద్వారా ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది." అని సోలానో చెప్పారు.
 
ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు
కొంతమంది శాస్త్రవేత్తలు గతంలో చమురు అకర్బన మూలాన్ని కలిగి ఉందని, జీవుల అవశేషాలు అవసరం లేకుండా భూమి లోతులలో ఏర్పడుతుందని వాదించారు. వీటిలో అనేక సిద్ధాంతాలు 19వ శతాబ్దంలోనే ప్రతిపాదించారు. దానికి ఉదాహరణ మూలకాల మొదటి ఆవర్తన పట్టికను ప్రచురించిన రష్యన్ రసాయన శాస్త్రవేత్త డిమిత్రి మెండలీవ్‌. అకర్బన సిద్ధాంతాల ప్రకారం భూ ఆవరణలో కార్బన్ అనేది హైడ్రోకార్బన్ అణువులుగా ఉంటుంది. ప్రధానంగా మీథేన్, పెట్రోలియంలో పెద్ద మొత్తంలో కనిపించే హైడ్రోకార్బన్‌లు సేంద్రీయ శిలాజాలు అవసరం లేని ప్రక్రియల ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఈ హైడ్రోకార్బన్‌లు ఉపరితలం మీదకు చేరే వరకు ఆవరణ (మాంటిల్) నుంచి భూమి పైభాగం(క్రస్ట్)కు వెళ్లిపోతాయి. లేదా అభేద్యమైన పొరలలో ఉండి చమురు నిక్షేపాలను ఏర్పరుచుకుంటాయి. ఈ సిద్ధాంతం ఆస్ట్రియన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త థామస్ గోల్డ్ (1920-2004)ది. ఆయన కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ .
 
గోల్డ్ 1992లో అమెరికన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ అయిన పీఎన్ఏఎస్‌లో ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. ఆ తర్వాత ఆయన అదే పేరుతో డీప్ హాట్ బయోస్పియర్ అనే పుస్తకం రాశారు. గోల్డ్ విషయానికొస్తే భూమిపై హైడ్రోకార్బన్‌లు జీవ వ్యర్థాల (శిలాజ ఇంధనాలు) ఉప-ఉత్పత్తి కాదు. కానీ దాదాపు 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడిన పదార్థాలలో సాధారణ భాగం. 1950లలో సోవియట్ శాస్త్రవేత్తలు ఇదే పరికల్పనను ఇప్పటికే చేశారని గోల్డ్ అంగీకరించారు. అయితే పెట్రోలియం అకర్బన మూల సిద్ధాంతాన్ని మెజారిటీ శాస్త్రవేత్తలు ఆమోదించలేదు. "అకర్బన మూలం సిద్ధాంతాలు నిరూపణ కాలేదు. ప్రయోగశాలలో హైడ్రోకార్బన్‌ను ఉత్పత్తి చేయడం సాధ్యం కాలేదు" అని మెక్సికన్ నిపుణులు చెప్పారు.
 
ఒక చివరి ప్రశ్న..
పెట్రోలియం మూలానికి చెందిన సేంద్రీయ సిద్ధాంతం చాలా విస్తృతంగా ఆమోదించినందున బహుశా కొంతమందిలో ఈ ప్రశ్న తలెత్తవచ్చు. డైనోసార్‌లు మెసోజోయిక్‌లో చమురు ఏర్పడిన సమయంలోనే జీవిస్తే వాటి అవశేషాలు, డైనోసార్ సేంద్రీయ పదార్థం సముద్రం దిగువకు పడిపోయి, కుదింపు, పరివర్తన ప్రక్రియను ఎదుర్కొంటాయి కదా? అని. చమురు ఉత్పత్తిలో ఏదైనా సేంద్రీయ పదార్థం ఉండవచ్చని మెక్సికన్ నిపుణులు అంటున్నారు. "అయినప్పటికీ చమురు ఉత్పత్తి చాలా సున్నితమైన ప్రక్రియ. దీనికి చాలా పెద్ద పరిమాణంలో పదార్థం అవసరం. ఇది సముద్రంలో పెద్ద మొత్తంలో ఉండే పాచి కారణంగా మాత్రమే సాధ్యమైంది. కాబట్టి వేరేవి అంత ముఖ్యమైనవి కావు" అని వారు తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments