Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా వుండాలంటే? ఆ రెండింటిని తగ్గించి..

అందం కోసం ఎర్రటి క్యాప్సికమ్స్ తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎర్రటి క్యాప్సికంలో 30 రకాల యాంటీయాక్సిడెంట్లు వుంటాయని.. ఇవి క్యాన్సర్ కారకాలపై పోరాడుతాయి. వీటిల్లో లైకో

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (11:47 IST)
అందం కోసం ఎర్రటి క్యాప్సికమ్స్ తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎర్రటి క్యాప్సికంలో 30 రకాల యాంటీయాక్సిడెంట్లు వుంటాయని.. ఇవి క్యాన్సర్ కారకాలపై పోరాడుతాయి. వీటిల్లో లైకోపేన్‌ కూడా పెద్దమొత్తంలో ఉంటుంది.


ఇది కూడా ప్రోస్టేట్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్ల వంటివి దరిజేరకుండా చూస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికీ ఇదెంతో మేలు చేస్తుంది. దీనిలోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికే కాదు, శరీరం ఐరన్‌ను గ్రహించుకోవటానికి తోడ్పడుతుంది.
 
అలాగే చర్మం కాంతివంతంగా మారాలంటే.. కేవలం బయటకు వెళ్లినప్పుడు మాత్రమే సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడటం సరికాదు. బయటకు వెళ్లేందుకు ఇరవై నిమిషాల ముందు ఓసారి రాసుకోవాలి. రోజువారీ తీసుకునే ఆహారంలో ఎ, సి విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. 
 
ముఖ్యంగా క్యారెట్లూ, బొప్పాయీ, నిమ్మజాతి పండ్లూ, పైనాపిల్‌, యాపిల్‌ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చర్మాన్ని బిగుతుగా మార్చడమే కాదు, తాజాగానూ ఉంచుతాయి.

నీళ్లు వీలైనంత ఎక్కువగా తాగడం వల్ల కూడా చర్మం తాజాగా ఉంటుంది. నూనె, ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఆ ప్రభావం చర్మంపై పడుతుంది. అందుకే ఉప్పు, నూనెల్ని వంటల్లో ఉపయోగించే మోతాదును బాగా తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments