బొప్పాయిని స్నాక్స్‌గా తీసుకుంటే..?
స్నాక్స్‌గా బజ్జీలు, సమోసాలు లాగిస్తున్నారా? ఐతే ఇక ఆపండి. బొప్పాయిని స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా ఒత్తిడి మాయమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, ఉరుకులు పరుగుల
స్నాక్స్‌గా బజ్జీలు, సమోసాలు లాగిస్తున్నారా? ఐతే ఇక ఆపండి. బొప్పాయిని స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా ఒత్తిడి మాయమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, ఉరుకులు పరుగులు తీస్తున్న ప్రస్తుత ఆధునిక యుగంలో పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బొప్పాయి.. పని ఒత్తిడిని దూరం చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే బొప్పాయిని స్నాక్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. శరీర బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది దివ్యౌషధం. ప్పాబొయిలో విటమిన్ సి ఎక్కువ ఉంది. ఇది మన శరీరంలో రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది. మధుమేహాన్ని నియంత్రించవచ్చు.
కంటిచూపును కూడాబొప్పాయి మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవాళ్లకి కూడా బొప్పాయి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. బహిష్టు సమయంలో నొప్పితో బాధపడే మహిళలకు బొప్పాయి పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్, బెటా కెరొటిన్ వంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో చర్మాన్ని సంరక్షిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.