Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట పెరిగితే కష్టమే.. బ్లాక్ టీ, గ్రీన్ టీ తాగితే మేలెంతో తెలుసా?

శారీరక శ్రమ లేదా? పొట్ట పెరిగిపోతుందా? లావైపోతున్నారా? ఐతే హృద్రోగ సమస్యలు తప్పవంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లకు తోడు.. గంటల పాటు కూర్చుని వుండటం ద్వారా చాలామందికి పొట్

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (11:34 IST)
శారీరక శ్రమ లేదా? పొట్ట పెరిగిపోతుందా? లావైపోతున్నారా? ఐతే హృద్రోగ సమస్యలు తప్పవంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లకు తోడు.. గంటల పాటు కూర్చుని వుండటం ద్వారా చాలామందికి పొట్ట ముందుకు తన్నుకొచ్చేస్తుంది. 
 
ఇంకా సన్నగా వున్నవారికి కూడా పొట్ట పెరిగిపోతే.. హృద్రోగాలు వచ్చే అవకాశం అధికమని యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది. 45 ఏళ్లు దాటిన 1500 మందిని పరిశోధించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. పొట్ట అధికంగా ఉన్నవారు వ్యాయామం చేయాలని, పిండిపదార్థాలు తీసుకోవడం తగ్గించాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
ఇంకా గ్రీన్, బ్లాక్ టీలను ప్రతిరోజూ తాగితే ఒబిసిటీ, మధుమేహం దూరమవుతాయని తద్వారా హృద్రోగ వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగిన వారి కొలెస్ట్రాయిల్ స్థాయి తగ్గడంతోపాటు మధుమేహ వ్యాధిగ్రస్థులకు చక్కెర స్థాయి తగ్గి షుగర్ అదుపులో ఉంటుందని.. మధుమేహులు గ్రీన్, బ్లాక్ టీ తాగితే వారి షుగర్ అదుపులో ఉందని వెల్లడి అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

Srivishnu: అల్లు అరవింద్ ప్రజెంట్స్ లో శ్రీ విష్ణు హీరోగా #సింగిల్ చిత్రం

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

తర్వాతి కథనం
Show comments