Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొప్పాయితో 5 అమూల్యమైన ప్రయోజనాలు... ఏంటవి?

బొప్పాయి పండు గురించి తెలియనివారుండరు. అయితే పచ్చి బొప్పాయి కాయలో, విత్తనాల్లో కూడా అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మెక్సికో లోని ఒక వైద్య పరిశోధక బృందం స్కోలియాసిన్ అనే వెన్నుముక వంకరపోయే వ్యాధికి ప్రధమిక దశలో బొప్పాయిలోని పెపైన్ ఎంజైమును వాడ

Advertiesment
బొప్పాయితో 5 అమూల్యమైన ప్రయోజనాలు... ఏంటవి?
, శనివారం, 5 మే 2018 (19:59 IST)
బొప్పాయి పండు గురించి తెలియనివారుండరు. అయితే పచ్చి బొప్పాయి కాయలో, విత్తనాల్లో కూడా అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.  మెక్సికో లోని ఒక వైద్య పరిశోధక బృందం స్కోలియాసిన్ అనే వెన్నుముక వంకరపోయే వ్యాధికి ప్రధమిక దశలో బొప్పాయిలోని పెపైన్ ఎంజైమును వాడి సత్పలితాలు సాధించారు. బొప్పాయిలో ఆరోగ్య ప్రయోజనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
 
1. బొప్పాయి కాయని తరచుగా కూర వండుకుని తింటుంటే జఠరాగ్ని బాగా వృద్ది చెంది జీర్ణశక్తి మెరుగవడంతో పాటు బాలింతల్లో దోషరహితమైన స్తన్యం సమృద్దిగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా పసిబిడ్డలకు కలిగే అజీర్ణం, విరేచనం వంటి వికారాలు తొలగిపోతాయి. బొప్పాయి పాలల్లో పొక్కే గుణం ఉంది. కాబట్టి బొప్పాయి పాలల్లో కొబ్బరినూనె లేదా నెయ్యి కలిపి గజ్జి, చిడుము వంటి చర్మవ్యాధులపై పూయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
 
2. తేలు కుట్టిన చోట బొప్పాయికాయ పాలను పట్టించి ఒక స్పూన్ పాలను పంచదారతో కలిపి సేవిస్తే శీఘ్రంగా ఉపశమనం కలుగుతుంది. ముసాంబరాన్ని బొప్పాయి పాలతో నూరి సెనగగింజంత మాత్రలు చేసి రోజూ రెండు పూటలా ఒక్కొక్క మాత్ర వంతున తీసుకుంటుంటే స్త్రీలలో ఋుతుక్రమం బాగా విడుదలవుతుంది.
 
3. బొప్పాయి విత్తనాలను నీడలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసి పావుస్పూను వంతున ఉదయం, రాత్రి వేడినీటితో సేవిస్తే ఉదరంలోని క్రిములు పడిపోతాయి.
 
4. బొప్పాయి కాయను కొబ్బరికోరులాగా తరిగి కొద్దిగా ఆముదం కలిపి వేడి చేసి ఆయా భాగాలపై వేసి కట్టుకడుతుంటే వృషణాల వాపు, స్తనాల్లో గడ్డలు, నొప్పులు, పోటు తగ్గుతాయి.
 
5. బొప్పాయి కాయను చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఎండించి మెత్తని పొడి చేసి రోజూ మూడుసార్లు అరస్పూను పొడిలో తగినంత తేనె కలిపి తింటే మలబద్దకం, కడుపునొప్పి, అజీర్తి, వికారం, అరుచి, ఆకలిలేకపోవడం  లాంటి ఉదర సంబంద సమస్యలు తొలగిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనం చేసిన వెంటనే శృంగారంలో పాల్గొంటే ఏమౌతుంది?