నేలవేము చూర్ణాన్ని తేనెతో కలిపి...?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (12:30 IST)
నేలవేము ఆంధ్రదేశమంతటా పెరుగుతుంది. ఇది దాదాపు ఒక మీటరు పొడవు ఉండి నిటారుగా పెరిగి ఏక ద్వివార్షిక మొక్క. దీనిని తెలుగులో నేలవేము, సంస్కృతంలో బొనింబ అని పిలుస్తారు. ఇది ఆకాస్థేసి కుటుంబానికి చెందినది. దీని ఆకులు పచ్చిమిరపకాయ ఆకులను పోలి ఉంటాయి. దీని పువ్వులు చిన్నగా తెల్లగా ఊదారంగులో ఉంటాయి. నేలవేమును సమూలంగా వైద్యంలో వాడుతారు. జవరి నెలలో దీనిని పొందవచ్చును.
 
1. నేలవేము చూర్ణాన్ని తేనెతో కలిపి 1-3 గ్రాములు సేవించిన విష జ్వరాలు తగ్గుతాయి.
 
2. నేలవేము, తిప్పతీగె, కరాక్కాయ మొదలగు వానిని సమాన భాగాలుగా తీసుకుని రోజూ ఉదయం - సాయంత్రం 2-3 గ్రాముల చొప్పున తేనెతో సేవిస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. 
 
3. నేలవేము సమూలం, దాచుహరిద్రా 1/2 గ్రా, శొంఠి 1 గ్రా కలిపి కషాయంగా కాచి 30 మి.లీ. ఉదయం - సాయంత్రం సేవించిన కామెర్లు తగ్గుతాయి.
 
4. నేలవేము కషాయాన్ని 40-50 మి.లీ. ఉదయం - సాయంత్రం సేవిస్తే మంచి స్తవ్యం (పాలు) వృద్ధి చెందుతాయి. 
 
5. నేలవేము మధుమేహంలో కూడ ఉపయుక్తంగా ఉంటుంది. అలానే పురుషుల్లో వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments