Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జుట్టు తెల్లబడటానికి కారణం ఏమిటో తెలుసా?

జుట్టు తెల్లబడటానికి కారణం ఏమిటో తెలుసా?
, సోమవారం, 21 జనవరి 2019 (20:27 IST)
ఈ ఆధునిక యుగంలో పెరుగుతున్న కాలుష్యానికి అనుగుణంగా జుట్టు అనారోగ్యానికి గురి అవుతుంది. ఇందులో ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడటం ఎక్కువమందిలో చూస్తున్నాము. జుట్టు మూలలలో లేదా ఫాలికిల్‌లో సహజసిద్ధ వర్ణ ద్రవ్యం  అయినట్టి మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల జుట్టు తెల్లగా అవుతుంది. ఇలా వీటి ఉత్పత్తి తగ్గడం వల్ల జుట్టు మొదళ్లు నెమ్మదిగా బలహీనమవుతాయి. ఫలితంగా వెంట్రుకల రంగు నెమ్మదిగా కోల్పోయి తెలుపు రంగులోకి మారుతుంది. జుట్టు తెల్లగా అవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
 
1. మానసిక ఒత్తిడి వల్ల కూడా వెంట్రుకలు త్వరగా రంగు మారుతాయి. ఒత్తిడి వల్ల జూట్టు ఆరోగ్యాన్ని మరియు పెరుగుదలను ప్రోత్సహించే వర్ణద్రవ్యం ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల జుట్టు నెరవడాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
 
2. మంచి పోషకాలతో కూడిన ఆహారం మీ ఆరోగ్యాన్ని మాత్రమె కాకుండా మీ వెంట్రుకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. విటమిన్ 'B 12', టీ అధికంగా తీసుకోవటం, కాఫీ, కారపు ఆహారాలు మరియు వేయించిన ఆహారాలు తీసుకోవటం వలన జుట్టు త్వరగా నెరుస్తుంది.
 
3. కొన్ని రకాల వైద్యపరమైన సమస్యల వలన కూడా వెంట్రుకల రంగు తెలుపు రంగులోకి మారుతుంది. 'హైపర్ థైరాయిడిజం' లేదా 'హైపొ థైరాయిడిజం' వంటి థైరాయిడ్ గ్రంధి సమస్యలు వలన కూడా జుట్టు రంగు మారే అవకాశం ఉంది.
 
4. జుట్టు నెరవటానికి చాలా రకాల పోషకాల లోపం అని చెప్పవచ్చు, అంతేకాకుండా, ఈ పోషకాల లోపం వల్లనే జుట్టు రాలటం, బలహీనంగా అవటం లేదా మెరుపును కోల్పోతాయి. యుక్త వయసులో జుట్టు నెరవటానికి ఈ పోషకాల లోపమే ఒక కారణం. సరియైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడకుండా చూసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాంకర్‌ను పెళ్లాడబోతున్నా... శృంగారంలో పాల్గొని వుంటుందేమోననీ...